10-08-2025 12:00:00 AM
రాష్ర్టవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో ఆధార్ కార్డు నమోదు ప్రక్రియ జరుగుతున్నది. ఆపరేటర్లు కొత్తగా కార్డుల కోసం ఐరిష్ ద్వారా ఫొటోలు తీయడంతో పాటు కార్డులు అప్డేట్ చేస్తున్నారు. జిల్లాల్లో ఆధార్ కార్డులు లేని విద్యార్థులు వేలాది మంది ఉండటం తో విద్యాశాఖ ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. ఆపరేటర్లు ఆ మండలానికి చెందిన ఎంఈవోలు సూచించిన పాఠశాలలకు వెళ్లి.. విద్యా ర్థులకు ఆధార్ సేవలు అందిస్తున్నారు.
రాష్ర్టవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు ఆధార్ కార్డులు లేకపోవడంతో విద్యాశాఖ ఎన్‌రోల్ కేటాయించడం కుదరడం లేదు. ఉన్నత చదువులకు గుర్తింపుగా పనికొచ్చే ఆపార్ సంఖ్యను బట్టే పాఠశాలలకు నిధులు కేటాయించను న్నారు. దాంతో ఆధార్ కార్డు తప్పనిస రిగా మారింది. మండల విద్యాశాఖ అధికా రులు సూచించిన విధంగా ఆపరేటర్లు పాఠశా లలకు వెళ్లి ఆధార్ నమోదు చేపడుతున్నారు. పుట్టిన తేదీ ధ్రువపత్రాలు లేని వారికీ జిల్లాల్లోని గిరిజన తండాలు, గ్రామీణ ప్రాంత నిరుపేదలు ముంబై, పుణె, హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు.
వారి పిల్లలతో పాటు ఇతర నుంచి రాష్ట్రాల వచ్చిన కూలీల పిల్లలకు పుట్టిన తేదీ ధ్రువ పత్రాలు లేక ఆధార్ నమోదుకు దూరం అవుతున్నారు. వారందరికీ పాఠశాలల్లో ఆధార్ కార్డులు జారీ చేయనున్నారు. ఇదివరకు సర్వశిక్షా అభియాన్ కింద మండల ఎమ్మార్సీ భవనాల్లో 0 నుంచి 15 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ రెండేళ్లుగా నిర్వహించారు. ఇటీవల ఎమ్మార్సీల్లో ఉన్న ఆధార్ కార్డుల జారీ కేంద్రాలను ఎత్తేశారు. దీంతో మళ్లీ పాఠశాలల్లో ఆధార్ కేంద్రాలు తెరవాల్సి వచ్చింది. ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యను గుర్తించి, అందుకు పాఠశాలల్లో అవసరమైనన్ని కేంద్రాలు ఏర్పాటుచేయాలి.
రాము, సికింద్రాబాద్
పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి
గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాజీపేట పట్టణంలో పారిశుద్ధ్యం పడకేసింది. పట్టణంలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, మురికి కుంటలే దర్శనమిస్తున్నాయి. దాదాపు అన్ని డివిజన్లలో ఇదే పరిస్థితి. కాజీపేటలో ఓ మునిసిపల్ సర్కిల్, ఓ డిప్యూటీ కమిషన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఉన్నప్పటికీ పారిశుధ్య కార్మికులపై వారికి అజమాయిషీ లేదు. పారిశుధ్యం లోపించడం వల్ల పట్టణవాసులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగాల బారిన పడుతున్నారు. స్థానికులు ప్రజాప్రతినిధులకు, కమిషనరు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసినా, సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించేలా బల్దియా చొరవ చూపాలి.
మహబూబ్ అలీ, కాజీపేట