calender_icon.png 27 September, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల రుణమాఫీ సమస్య పరిష్కారం జరిగే వరకు ఊరుకునేది లేదు

27-09-2025 01:40:03 AM

మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ 

ఘట్ కేసర్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : రైతుల రుణమాఫీ సమస్య పరిష్కారం జరిగే వరకు ఊరుకునేది లేదని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. ఘట్ కేసర్ రైతు సేవ సహకార సంఘం 49వ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఘట్ కేసర్ పట్టణంలోని నారాయణ గార్డెన్ లో జరిగింది. రైతు సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో రైతు రుణమాఫీ అందరికీ చేసి కొందరిని విస్మరించడం బాధాకరమన్నారు. కో-ఆపరేటివ్ బ్యాంకులు రైతుల అభివృద్ధికి ఏర్పడినవని ప్రభుత్వం గుర్తించాలన్నారు. సొసైటీ బ్యాంకులు అభివృద్ధిలో ఉంటే రైతులకు ఎంతో మేలు చేయవచ్చన్నారు. రైతు సొసైటీ పాలకవర్గం ఒక్క రూపాయి మిస్టేక్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రుణమాఫీ కోసం రిలే నిరాహార దీక్షలు చేస్తున్న రైతుల విషయమై ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని చర్చించి ఒక మంచి ప్రకటనతో వచ్చి రైతుల రిలే నిరాహార దీక్షలను విరమింప చేస్తానని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సహకార సంఘం వైస్ చైర్మన్ బద్దం అనంతరెడ్డి, డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి, జిల్లాల పోచిరెడ్డి, బిరెడ్డి స్రవంతి, వడ్త్యా మహేందర్, చందుపట్ల ధర్మారెడ్డి, కె. ఉదయ్ కుమార్ రెడ్డి, గోపు బాలరాజు యాదవ్, మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ రాజ్, రైతులు, మాజీ ఎంపీపీలు బండారి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి,  మాజీ కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి, మాజీ ఎంపిటిసి మేకల నర్సింగరావు, మాజీ ఉపసర్పంచ్ ఎల్సాని ఐలయ్య యాదవ్, కొమ్మిడి మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.