calender_icon.png 19 August, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాపన్న ఆశయాలతో ముందుకు సాగాలి

19-08-2025 12:00:00 AM

డీసీసీ జనరల్ సెక్రటరీ అయిలా మధు గౌడ్

సనత్‌నగర్, ఆగస్టు 18 (విజయక్రాంతి): బల్కంపేట్‌లో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలను సోమవారం డీసీసీ జనరల్ సెక్రటరీ అయిలా మధు గౌడ్  ఆధ్వర్యంలో ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ పాపన్న విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మధు గౌడ్ మాట్లాడుతూ... సర్దార్ సర్వాయి పాపన్న సాధారణ కూలీ కుటుంబంలో పుట్టినా తన ధైర్యం, త్యాగం, పట్టుదలతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు.

నిజాం రాజుల అణచి వేతకు వ్యతిరేకంగా కత్తి ఎత్తి, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడారు. నేటి తరా లు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి అని పిలుపునిచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిచారు. ఈ కార్యక్రమంలో కోతపల్లి రాజు గౌడ్, భిక్షపతి గౌడ్, శంకర్ గౌడ్, రాము గౌడ్, అనిల్ గౌడ్, బాబులు గౌడ్, డి.మహేశ్ గౌడ్, మురళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఆమీర్‌పేట్‌లో..

సనత్నగర్ ఆగస్టు 18 (విజయ క్రాంతి):- ఆమీర్‌పేట్‌లో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సర్దార్ పాపన్న బడుగు, బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని, నిజాం రాజులకు వ్యతిరేకంగా పోరాడి, ప్రజల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.

ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శైలేష్ గౌడ్, ఐల సురేష్ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్, రామకృష్ణ గౌడ్, గౌలికల్ ప్రదీప్, పురుషోత్తం, వెంకట్ నాయుడు, మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.