calender_icon.png 26 January, 2026 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచి సమాజ నిర్మాణానికి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి

26-01-2026 12:13:28 AM

జిల్లా ఎన్నికల అధికారి ఆదర్శ్ సురభి

వనపర్తి, జనవరి 25 ( విజయక్రాంతి ) :ప్రజాస్వామ్యం లో ఓటు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని, మంచి సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ ఓటు హ క్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. ఆదివారం వనపర్తి జిల్లా ఐడిఓసి మీటింగ్ హాల్లో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా ని ర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం మరియు ఇతర జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం రిపబ్లిక్ డే కి ఒక రోజు ముందు అంటే జనవరి 25, 1950న ఏర్పడిందని, అందుకే ప్రతి ఏటా ఈ రోజున జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వివరించారు. కార్యక్రమంలో వివిధ జిల్లా శాఖల అధికారులు, ఎన్నికల అధికారులు, తహసిల్దార్లు, సీనియర్ సిటిజన్ ఓటర్లు, విద్యార్థులు, కొత్త ఓటర్లు, వికలాంగ ఓటర్లు, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి: తహసిల్దార్ స్వప్న 

మిడ్జల్ జనవరి 25 : ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని తహసిల్దార్ స్వప్న అన్నారు.16 వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని. ఆదివారం మండల కేంద్రంలోని కేజీబీవీ కస్తూర్బాగా పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు.

స్వతంత్ర భారతదేశంలో పరిపాలనను నిర్దేశించేది ఓటు హక్కు ద్వారానే అని వివరించారు. అలాంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరు నమోదు చేయించుకోవడమే కాకుండా బాధ్యతగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎడ్ల శంకర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు