calender_icon.png 26 January, 2026 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేయాలి

26-01-2026 12:11:44 AM

ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి 

అయిజ జనవరి 25:అయిజ అభివృద్ధి జరగాలంటే త్వరలో  జరగబో యే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేయాలని ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి ఎమ్మెల్యే విజయుడు కార్యకర్తలకు పిలుపుని చ్చారు. ఈ మేరకు ఆదివారం అయిజ పట్టణ కేంద్రంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే విజయుడుతో కలిసి హాజరయ్యారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్సీ చల్లా మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేటికి అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇక్కడి కాంగ్రెస్ నాయకులు వసూళ్ల దందాకు తెరలేపారని ఆరోపించారు. అలాంటి వారికి అవకాశం ఇస్తే పాలన ఎలా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. గత పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేది అన్నారు. పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందరికీ దక్కాయని గుర్తు చేశారు.

అయితే వార్డు మెంబర్లుగా పోటీ చేసే ఆ శావాహులందరిని సమన్వయపరిచి ఒక మంచి నాయకుడిని బరిలో నిలిపేందుకు అవకాశం ఇద్దామన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు.అనంతరం ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ... రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ ఎత్తున గెలిపించి అభివృద్ధికి అడుగులు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ దేవన్న, వైస్ చైర్మన్ మాల నరసింహులు,సీఎం సురేష్, కురువ పల్లయ్య, రంగు సుమలత, తదితరులు పాల్గొన్నారు.