calender_icon.png 9 November, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బలగం తర్వాత మళ్లీ ఆ ఫీలింగ్ ఇచ్చిన చిత్రమిదే

09-11-2025 12:03:42 AM

తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’. ఈ సినిమాను సందీప్ అగరం, అష్మితరెడ్డి నిర్మించారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. నవంబర్ 7న విడుదలైన ఈ సినిమా విజయోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు, రచయిత, నటుడు బీవీఎస్ రవి మాట్లాడుతూ.. “అభిరుచి ఉన్న నిర్మాతల్ని ప్రోత్సహిస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి.

కొత్త హీరోలు, దర్శకులకు అవకాశాలు వస్తాయి. థియేటర్‌కు వెళ్లినట్టుగా కాకుండా.. ఊర్లోకి వెళ్లి చూసినట్టుగా ఉంటుందీ సినిమా. ‘బలగం’ తర్వాత మళ్లీ ఆ ఫీలింగ్ ఇచ్చిన చిత్రమిదే. ఈ సినిమాకు చాలా అవార్డులు వస్తాయి. ఇది మీడియాకు నచ్చిన చిత్రం.. అంటే ఆ సినిమా కచ్చితంగా బాగుంటుందని అర్థం” అన్నారు. హీరో తిరువీర్ మాట్లాడుతూ.. “రిలీజ్ తర్వాత ఒక్క నెగెటివ్ కామెంట్ కనిపించలేదు.

ఎంకరేజ్ చేస్తున్న వాళ్లందరికీ థాంక్స్‌” అన్నారు. ‘ప్రతీ సీన్‌ను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నార’ని హీరోయిన్ శ్రావ్య అన్నారు. దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “ఇలాంటి కథలు థియేటర్లో ఆడవా? అని అనుకున్నా. కానీ ప్రేక్షకులు మా సినిమాను పెద్ద సక్సెస్ చేశారు. ఇక సహజత్వంతో కూడిన ఇలాంటి కథల్ని చేసేందుకు అందరూ ముందుకు వస్తారు” అన్నారు.

నిర్మాత సందీప్ మాట్లాడుతూ.. “మీడియా వల్లే మా మూవీ ఆడియెన్స్ వరకు రీచ్ అయింది. టీఎఫ్‌జేఏకి నా వంతుగా ఆర్థిక సాయం అందిస్తున్నా. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన నన్ను నిర్మాతగా నిలబెట్టిన మీడియాకు థాంక్స్‌” అని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి, ఎడిటర్ నరేశ్, సౌండ్ డిజైనర్ అశ్విన్, లిరిసిస్ట్ సనారే, చిత్రబృందం పాల్గొన్నారు.