calender_icon.png 26 January, 2026 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీరంతా మరో మిథాలీ రాజ్ కావాలి

26-01-2026 12:06:01 AM

రఘనాథపాలెం /ఖమ్మం జనవరి 25(విజయక్రాంతి): క్రీడా స్ఫూర్తితో ఆడి ముందుకు సాగుతూ.. మీరంతా మరో మిథాలీ రాజ్ కావాలని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేందర్ అన్నారు.. ఆదివారం  ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్ ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఇందిరాగాంధీ సీనియర్ మహిళ టి  20 జాతీయస్థాయి మహిళా క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేందర్ అన్నారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమని వారన్నారు. 

తొలుత క్రీడాకారుల పరిచయ వేదిక అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిక్కిలినేని నరేందర్ మాట్లాడారు. ఖమ్మం జిల్లా ఉద్యమాలు,  కళాకారులు, క్రీడాకారులకు నిలయమని, ఖమ్మం జిల్లా చైతన్య వంతమైన జిల్లా అని తమ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తూ క్రీడా హబ్ గా తీర్చిదిద్దుతుందని వారన్నారు. 

ఖమ్మం జిల్లాలో గ్రామీణ స్థాయి క్రీడాకారుల నుంచి మొదలుకొని రాష్ట్రస్థాయి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిని వారి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శింపచేశారని, ఏ  డబ్ల్యూ టీ 20 సి ఏ, ఖమ్మం క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ కోచ్,  నిర్వాహకులు మహమ్మద్ మతీన్ సారధ్యంలో  జాతీయస్థాయి మహిళా క్రికెట్ పోటీలు ఖమ్మం గడ్డపై జరపడం హర్షనీయమని వారన్నారు.. పలు రాష్ట్రాల నుంచి క్రికెట్ క్రీడపై ఉన్న మక్కువతో జాతీయస్థాయిలో తమ క్రీడా నైపుణ్యాన్ని చాటుకునేందుకు ఇక్కడి వరకు రావడం సాధారణ విషయం కాదని, ఈ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు ఇండియా తరఫున రిప్రజెంట్ చేసే  స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు.

  ఈటోర్నమెంట్ నిర్వహణలో ముందుకు వచ్చిన ప్రతి దాతలకు, రాజస్థాన్ మార్బుల్స్,  ఇతర దాతలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నామని వారన్నారు. ఈ క్రికెట్ క్రీడలో ప్రతి ఒక్కరు మరో మిథాలీ రాజ్ కావాలని ఆ దిశగా తమ క్రీడా పటిమను చూపాలని వారు కోరారు. తొలుత జాతీయ గీతంతో క్రీడ పోటీల నిర్వహణ ప్రారంభం కాగా క్రీడాకారులను వారు పరిచయం చేసుకొని టాస్ వేయగా  తమిళనాడు  వర్సెస్ ఉత్తరప్రదేశ్  జట్లలో  టాస్ గెలిచిన ఉత్తరప్రదేశ్ జట్టు బ్యాటింగ్ ను ఎంచుకుంది.

తమిళనాడు జట్టుపై ఉత్తరప్రదేశ్ జట్టు విజయం సాధించింది. నాలుగు కెమెరాలతో డి ఎన్ బి  న్యూస్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారాలు జరిగాయి.  క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించిన వారిలో సిపిఎం పార్టీ  సీనియర్ నాయకులు నాగుల్ మీరా, కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ మహిళా నాయకురాలు సుగుణ, రాజస్థాన్ మార్బుల్స్ అధినేత గుజ్జర్ బావర్ జి,  నిర్వాహకులు ఖమ్మం క్రికెట్ అసోసియేషన్ కన్వీనర్ మహమ్మద్ మతిన్, ఆలిండియాటి  20 ఉమెన్  క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ సందీప్ ఆర్య, కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ సీనియర్ నాయకులు చోటేబాబా, ఖమ్మం జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి, అఫీషియల్ అంపైర్స్ నైనా,  ప్రియా, సంస్కృతి,  సయ్యద్ పైసల్ అహ్మద్,   సీనియర్ జర్నలిస్టు షేక్ జానీపాషా,  టి డ బ్ల్యూ జె ఎ ఫ్ ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దగ్గుపాటి మాధవ్, ఖమ్మం జిల్లా కెమెరామెన్ సంఘం  ఖమ్మం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు ఫయాజ్, గణేష్, ఉపాధ్యక్షులు అర్షద్, కోశాధికారి యూసఫ్, పవన్,  యాసిన్  పాల్గొన్నారు.