08-09-2025 01:43:28 AM
రాజాపూర్ సెప్టెంబర్ 7: బాలానగర్ మండలంలోని కేతిరెడ్డిపల్లి లో అంబేద్కర్ విగ్రహo చూపుడువేలు ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని రాజాపూర్ అంబేద్కర్ సంఘం మండల కమిటీ పోలేపల్లి కృష్ణయ్య డిమాండ్ చేశారు. విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షంచాలని ఆదివారం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో రాజాపూర్ పోలీస్ స్టేషన్ లో చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతు బాలనగర్ మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామంలో నాలుగు రోజుల క్రితం భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గ చూపుడువేలును కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడం హేయమైన చర్య అని అన్నారు.
విగ్ర హం చూపుడువేలిని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి వారిపై చట్టపరమైన చర్య లు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల కమిటీ నాయకులు, సీనియర్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.