calender_icon.png 23 November, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే ఇంట్లో ముగ్గురి ఆత్మహత్య

23-11-2025 12:00:00 AM

మృతుల్లో తల్లి, తండ్రి, కూతురు

5 నెలల క్రితమే పెద్దకూతురు బలవన్మరణం

ముషీరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): ఒకే ఇంట్లో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాగ్ అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. రామకృష్ణ నగర్‌లో దంపతులు శ్రీనివాస్, విజయలక్ష్మి (అలియాస్ పద్మావతి), కూతురు శ్రావ్య (15) అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం కిటికీలకు చీరల సహాయంతో ఉరేసుకొని ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారు.

ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచా రం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. తలుపులు పగులగొట్టి చూడగా ముగ్గురు విగత జీవులుగా కనిపించారు. వీరి ఆత్మహత్యకుగల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా ఐదు నెలల క్రితం శ్రీనివాస్, విజయలక్ష్మిల పెద్ద కూతురు కావ్య కూడా ఆత్మహత్య చేసుకున్నది. దీంతో కుంగిపోయి వీరు కూడా ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం.