calender_icon.png 22 November, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలమండలికి రూ.3,385 కోట్లు

26-07-2024 12:46:28 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 25 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తున్న జలమండలికి రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. బడ్జెట్‌లో రూ.3,385 కోట్ల నిధులను కేటాయించింది. మంచినీటి సరఫరా కోసం పైప్‌లైన్లు, ప్రాజెక్టులు, మురుగునీటి నిర్వహణ, శుద్ధి కోసం నిర్మిచంబోయే ఎస్టీపీలు, ఇతర ప్రాజెక్టుల కోసం ఈ నిధులు ఆసరా కానున్నాయి. నగర వాసులకు ఉచిత నీటి సరఫరా చేస్తుండడంతో జలమండలి ఆదాయం తగ్గి పూర్తిగా ప్రభుత్వంపైనే ఆధారపడాల్సి వస్తోందనే వాదనలున్నాయి. దానికి తోడు విద్యుత్ శాఖకు కూడా జలమండలి భారీగా బకాయిపడి ఉంది. బడ్జెట్‌లో కేటాయించిన నిధులు విడుదలైతే జలమండలికి కాస్త ఊరట కలుగుతుంది. గతేడాది బీఆర్‌ఎస్ ప్రభుత్వం జలమండలికి రూ.1,960కోట్లు కేటాయించింది.