calender_icon.png 2 December, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు

02-12-2025 12:21:49 AM

ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 1, (విజయక్రాంతి)పాల్వంచ,నవభారత్ లోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి పర్యటించనున్న. నేపథ్యంలో ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు నందు సోమవారం పోలీసు అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. అదనపు ఎస్పీ-01, డీఎస్పీ-05,సిఐలు-30,ఎస్త్స్రలు-62,ఏఎస్‌ఐ/హెడ్ కానిస్టేబుళ్ళు -300, హోమ్గారడ్స్-160 , 07 స్పెషల్ పార్టీలు,02 ఏఆర్ ప్లాటున్స్ మొత్తం 900 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును 15 సెక్టార్లుగా విభజించి,ఆయా సెక్టార్లకు డీఎస్పీలను ఇన్చార్జీలుగా నియమించడం జరిగిందన్నారు. ప్రత్యేక భద్రతా బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులను గమనిస్తే వెంటనే పై అధికారులకు తెలియజేయాలని ఎస్పీ అన్నారు. తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వర్తించాలని సమావేశంలో పాల్గొన్న అధికారులకు ఎస్పీ సూచించారు.