9 April, 2026 | 3:12 AM

స్కేటింగ్‌తో అయోధ్య, కేదార్ నాథ్‌కు

09-04-2026 12:50 AM

మండుటెండలో యువకుడి సాహసం

ఉట్నూర్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): చదువుల్లో రాణించేలా ఆశీర్వదించాలని ఓ యువకుడు స్కేటింగ్ ద్వారా అయోధ్య, కేదార్‌నాథ్ ఆలయాలకు బయలుదేరాడు. మం డుటెండలో గుడిహత్నూర్ మండలం సీతాగొండి అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తుం డగా ‘విజయక్రాంతి’ కెమెరాకు చిక్కాడు. ఈ సందర్భంగా యువకుడిని పలకరించగా, నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిరిపల్లి ఫకీర్ నాయక్ తండాకు చెందిన కిరణ్ అని వివరించాడు.

ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సా ధించాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉన్నత చదువులు కొనసాగించేలా ఆ భగవంతుని ఆశీస్సులు పొందాలని భావించి నట్లు తెలిపాడు. ఈ ప్రయత్నంలో భాగంగా తాను స్కేటింగ్ బూట్లు ధరించి, జాతీయ, కాషాయ జెండాలతో మండుటెండను సైతం లెక్కచేయకుండా బయలుదేరానని వివరించాడు. రోజుకు 40 నుంచి 50 కి.మీ. దూ రం ప్రయాణిస్తున్నానని తెలిపాడు. స్కేటింగ్ బూట్ల కోసం రూ. 10వేలు ఖర్చయ్యిందన్నాడు. అయోధ్య శ్రీరాముడు, కేదార్‌నాథ్ భోళా శంకరుడి దర్శనం అనంతరం తిరిగి స్కేటింగ్ చేస్తూనే ఇంటికి చేరుకుంటానని కిరణ్ తెలిపాడు.