09-07-2025 12:52:27 AM
తీవ్ర కసరత్తులు చేస్తున్న అమెరికా, ఇండియా
వాషింగ్టన్, జూలై 8: భారత్ మధ్య మినీ ట్రేడ్ డీల్ ప్రకటనకు సమయం ఆసన్నమైనట్టు తెలుస్తోంది. మీడియా కథనాల ప్రకారం ఈ ట్రేడ్ డీల్ నేడు ఫైనలైజ్ కానున్నట్టు సమాచారం. ఈ మధ్యంతర మినీ ట్రేడ్ డీల్ గురించి చాలా మంది ఇండియన్లు, అమెరికన్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ప్రతీకార సుంకాల అమలును జూలై 9 నుంచి ఆగస్టు 1కి వాయిదా వేసిన ట్రంప్ అమెరికాకు ఆసియాలో అత్యంత కీలకమైన భాగస్వాములుగా ఉన్న జపాన్, సౌత్ కొరియా దేశాలపై 25శాతం దిగుమతి సుంకాలు విధిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు దేశాలతో పాటు మరో 12 దేశాలకు సుంకాల లేఖలను పంపారు. ట్రంప్ లేఖలు పంపిన దేశాల్లో సుంకాలు 25 శాతం నుంచి 40 శా తం వరకు ఉన్నాయి.
ప్రతీకార సుంకాల అమలుకు అంతకు ముందు జూలై 9వ తేదీని డె డ్‌లైన్‌గా నిర్ణయించిన ట్రంప్ ప్రస్తుతం ఆ తే దీని ఆగస్టు 1కి మార్చారు. ఈ తేదీ కంటే ము ందే వివిధ దేశాలకు సుంకాల వివరాలు తెలుపుతూ లేఖలు పంపుతున్నారు. పలు దేశాలకు సుంకాల వివరాలతో లేఖలు పంపుతున్నట్టు ట్రంప్ మంగళవారం సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘అమెరికా ప్రతీకార సుంకాల వివరాలతో కూడిన లేఖలను వివిధ దేశాలకు జూలై 7 నుంచి పంపుతున్నాం.
’ అని వెల్లడించారు. అంతే కాకుండా మీరు ఏ కారణంతో సుంకాలు పెంచినా మేము ఇప్పుడు విధించిన సుంకాలకు అదనంగా సుంకాలు వేస్తాం అని ట్రంప్ వివిధ దేశాలను హెచ్చరించారు. ఇప్పటికే 90 రోజుల పాటు సుంకాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ట్రంప్ తాజాగా ఆ తేదీని జూలై 9 నుంచి ఆగస్టు 1కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.