26-01-2026 02:33:24 AM
బాన్సువాడ, జనవరి 25 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం ఎస్సీ గురుకుల పాఠశాల లో విషాదం చోటు చేసుకుంది. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సునీత శనివారం తన ఇంటి వద్ద ఫంక్షన్ ఉండడంతో పాఠశాల నుండి 40 కుర్చీలు ఆటోలో తరలించారు. తిరిగి అదే ఆటోలో బాన్సువాడ నుంచి బోర్లం గురుకుల పాఠశాలకు కుర్చీలను తీసుకువచ్చడంతో పాఠశాలలోని విద్యార్థి నీళ్లతో చేర్లను మోయించారు.
అదే పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని సంగీత కుర్చీలు ఆటోల నుంచి తీసి ఆవరణలో పెట్టి అదే ఆటోలో ఎక్కేటప్పుడు జారిపడి ఘటనా స్థలంలోనే మృతి చెందింది. పాఠశాల ప్రిన్సిపాల్ సునీతతోపాటు వైస్‌ప్రిన్సిపాల్‌తో పాటు ముగ్గురు టీచర్ల ప్రమేయం ఉందని విద్యార్థినులు పేర్కొనడం గమనార్హం. అంతేకాకుండా గురుకుల పాఠశాలలో విద్యార్థిను లతో కుర్చీలు మోయించడం కుర్చీలు దిం చడం ఎక్కడ ఉండదని అలాంటి సంఘటనలు జరగడం పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్య మే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నా రు.
విద్యార్థిని మృతి చెందడం పట్ల పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థిని సంగీత స్వగ్రామం మద్నూర్ మం డలంలోని కోడిచర. సంగీత మృత దేహాన్ని అదే ఆటోలో బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ సలహాదారు పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, సబ్‌కలెక్టర్ కిరణ్మయి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆస్పత్రికి చేరుకొని సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.