18-01-2026 12:23:08 AM
కొత్తకొండలో తగ్గని భక్తుల రద్దీ
భీమదేవరపల్లి,జనవరి17(విజయక్రాంతి): కొత్తకొండ వీరభద్రుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి సన్నిధిలో త్రిశూల స్నాన ఘట్ట వేడుకలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు లక్షల్లో తరలివచ్చారు. త్రిశూల స్నానం వల్ల శారీరక రుగ్మతలు, దోష పరిహారం జరుగుతుందని, సకాలంలో వర్షాలు కురుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని ఆలయ అర్చకులు వినయ్‌శర్మ తెలిపారు. వీరభద్రుడికి తొమ్మిది రోజులు ఘనంగా పూజలు చేసిన తదుపరి ఆలయం వద్ద నుంచి స్వామి వారిని త్రిశూల మూర్తిగా ఏర్పాటు చేసి ఆలయం చుట్టూ మూడుమార్లు ప్రదక్షణ చేయిస్తారు. అనంతరం పవిత్ర పుష్కరిణిలో కుంభాయుక్తంగా త్రిశూల స్నానం చేయిస్తారు. స్వామివారిని ఆలయ నుంచి తీసుకువచ్చే సమయంలో వీర శైవులు స్వామివారిని స్తుతిస్తూ వీరఖడ్గాలు వేస్తారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా పలువురు మహిళలు స్వామివారి వీర ఖడ్గాలు వేయడం విశేషం. కార్యక్రమంలో సీఐ రమేష్, ఎస్‌ఐలు రాజు, దివ్య, పోలీస్ సిబ్బంది పూజా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుం డా వీరభద్రుని స్తుతిస్తూ నృత్యం చేయడం కూడా ప్రత్యేక విశేషం. ఖడ్గాలు వేసిన వారిలో బంగిమటం పరమేశ్వరయ్య, కొత్తకొండ గ్రామ నివాసి మహేష్, అర్చకులు మొగిలిపాలెం రాంబా బులు భక్తి పాటల మధ్య నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. ఆలయ మద్ది నుంచి వీరభద్రుని తీసుకువచ్చిన వారి లో ఆలయ చైర్మన్ బొజ్జపురి అశోక్ ముఖర్జీ, డైరెక్టర్లు డబ్బా శంకర్, దేవరాజ్ శంకర్, గోనెల సంపత్ ఆల య సిబ్బంది ఈవో కిషన్ రావు మాడిశెట్టి శ్రీధర్, అనూ ష, రవితో పాటు భక్తులు పాల్గొన్నారు.