calender_icon.png 2 September, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌పై ట్రంప్ సలహాదారు ప్రేలాపనలు

02-09-2025 12:00:00 AM

వాషింగ్టన్, సెప్టెంబర్ 1: అవకాశం దొరికినా, దొరక్కపోయినా.. అవకాశాన్ని కల్పిం చుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవారో భారత్‌పై విషం కక్కుతూనే ఉన్నారు. నోటికొచ్చినన్ని ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా.. ‘రష్యాకు భారత్ చాకిరేవులా పనిచేస్తున్నది.

ఓ వర్గానికి మేలు చేసేందుకు భారత ప్రజల భవిష్యత్తును ఫణంగా పెడుతున్నది.  దానిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చర్యలు ఉక్రెయిన్‌వాసులకూ ముప్పు’ అని వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నవారో చైనా, రష్యాతో భారత్ సంబంధాలు నెరపడం యావత్ ప్రపంచ స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని ప్రేలాపన చేసి అభాసుపాలైన సంగతి విదితమే.