calender_icon.png 8 August, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంపు, మోదీల దిష్టిబొమ్మ దహనం

08-08-2025 12:00:00 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఆగస్టు07: వ్యవసాయ రంగంలో బహుళ జాతి కంపెనీలు భారత్ నుండి వైదొలగాలని డిమాండ్ చేస్తూ భారతదేశ ఎగుమతి వస్తువులపై 25శాతం సుంకం విధించి,50శాతం పెంచుతానని హెచ్చరించడానికి నిరసిస్తూ వెంటనే మద్దతు ధర అమలు చేయాలని కోరుతూ గురువారం మండల కేంద్రం అర్వపల్లిలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్ ట్రంపు,ప్రధాని మోదీల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

అనంతరం పీడీఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలెబోయిన కిరణ్ మాట్లాడుతూ భారత్ లో విదేశీ బహుళ జాతి కంపెనీలైన అమెజాన్,వాల్ మార్ట్,ఓలా, ఉబర్,సింగ్వి, మోనో లాంటి సంస్థలు దళారీలుగా వ్యవహరిస్తూ, వ్యవసాయ రంగంపై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నాయని,దీనికి ప్రధాని మోదీ తొత్తుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నాడని విమర్శిం చారు. 

ఈ కార్యక్రమంలో పూలే,అంబేద్కర్ ఆశయ పోరాట సమితి వ్యవస్థాపకులు ఈదురు వీరపాపయ్య, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ నాయకులు పోలెబోయిన లింగయ్య, వడకాల బయ్యన్న, దాసరి నాగరాజు, సురేష్   పాల్గొన్నారు.