17-01-2026 02:55:38 AM
హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి) : రాష్ట్రాన్ని పారిశ్రామిక విప్లవానికి కేంద్రంగా మార్చాలన్న సమున్నత సంకల్పం తో మాజీ సీఎం కేసీఆర్ రూపకల్పన చేసిన టీఎస్ విధానం దేశంలోనే అత్యుత్తమమైనదని సాక్షాత్తు నీతి ఆయోగ్ తాజా నివేదికలో ప్రశంసించడం యావత్ తెలంగాణకు గర్వకారణమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రె సిడెంట్ కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ దార్శనికతకు నిలువెత్తు నిదర్శనమని కొని యాడారు.
ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్... భారీ పరిశ్రమలకు తోడు, ఎంఎస్ ఎంఈ విభాగంలో రూ.2.6 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 25 లక్షల మందికి పైగా యువతకు గౌరవప్రదమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని తెలిపారు.
ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల వరకూ అందరూ తెలంగాణకు క్యూ కట్టేలా పెట్టుబడిదారుల్లో కొం డంత విశ్వాసాన్ని కల్పించిన విప్లవాత్మక విధానం తీ సుకొచ్చి పదేళ్లు దాటినా నేటికీ టీఎస్ స్ ప్రతిష్ట నలుదిశలా మార్మోగుతూనే ఉం దన్నారు. ఇకనైనా కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామనే భ్రమల్లో బతికే అరాచక శక్తులు బుద్ధి తెచ్చుకుంటే మంచిదని అన్నారు.