11-05-2025 12:51:50 AM
11.-5--.2025 నుంచి 17-.5.-2025 వరకు
రామడుగు రంగన్న సిద్ధాంతి
మేషం
ఈవారంలో ఈ రాశివారికి గ్రహస్థితి మధ్యరకంగా ఉంది-. శుభవార్తలు వింటారు. ధన వ్యయమవుతుంది. చేసే పనులు అనుకూలించవు. బంధుమిత్రులవల్ల ఇబ్బంది కలుగుతుంది. యువతీ యువకులకు అనుకున్న ఉద్యోగాలు, మంచి సంబంధాలు దొరుకుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువులలో ఉన్నతిని పొందుతారు. రైతులు ఇబ్బందులకు లోనవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.
వృషభం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు పూర్తవుతా యి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, పెండ్లి విషయాలలో శుభం జరుగుతుంది. ఉద్యోగస్తులకు శుభా లు, వ్యాపారస్తులు లాభాలు. విద్యార్థులు ఉన్నతిని సాధిస్తారు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. రైతులకు లాభాలు కలుగుతా యి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.- మొ త్తం మీద ఈ రాశివారికి 70 శాతం అనుకూలత, 30 శాతం ప్రతికూలత ఉంది.-
మిథునం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చేసే పనులు ఆలస్యంగా ఫలిస్తాయి. పోయిన ధనం తిరిగి లభిస్తుంది. బంధుమిత్రులతో స్పర్ధలు. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. విద్యార్థులు చదువులలో ముందుంటారు. వ్యాపారస్తులు, రైతులకు చేసే పనులలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశి వారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
కర్కాటకం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. శుభవార్తలు వింటారు. బం ధుమిత్రులతో విరోధాలు కలుగుతాయి. ధన వ్యయమవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగాలు, అనుకున్న వారితో వివాహాలు జరుగుతాయి. విద్యార్థులు ఉ త్సాహంగా చదువుతారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి. వ్యాపారస్తులకు, రైతులకు చేసే పనులలో సామాన్య లాభాలు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
సింహం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. శుభవార్తలు వింటారు. చేసే పనులలో కొంత అనుకూలత ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నా లు ఫలిస్తాయి. విద్యార్థులకు చదువులలో పట్టుదల అవసరం. వ్యాపారస్తులకు, రైతులకు ముందుచూపు ఉండాలి. ఉద్యో గస్తులకు ఒత్తిళు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
కన్య
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతారు. బంధువులతో సంతోషంగా ఉంటారు. యువతీ యువకులకు కోరుకున్న వారి తో వివాహ నిశ్చయాలు జరుగుతాయి. ఉద్యోగాలు లభిస్తాయి. విద్యార్థులకు విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులు, రైతులకు సంతోషం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 70 శాతం అనుకూలత, 30 శాతం ప్రతికూలత ఉంది.
తుల
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. బంధువులతో స్పర్ధలు కలుగుతాయి. చేసే వసులలో ఆటంకాలు ఏర్పడతాయి. యువతీ యువకులకు వివాహ, ఉద్యోగ విషయాలలో స్తబ్దత ఉంటుంది. విద్యార్థులు శ్రమించాలి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు ప్రతికూల కాలం. మొత్తం మీద ఈ రాశివారికి 30 శాతం అనుకూలత, 70 శాతం ప్రతికూలత ఉంది.
వృశ్చికం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. శుభకార్య తలంపు చేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండాలి. ధనవ్యయం అవుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. యువతీ యువకులకు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు చదువులలో పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 65 శాతం ప్రతికూలత ఉంది.
ధనుస్సు
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచి గా ఉంది. చేసే పనులలో రాణింపు.పెద్దవారితో పరిచయాలు, శుభవార్తలు వింటా రు. బంధువులతో సంతోషంగా ఉంటారు. యువతీ యువకులకు వివాహం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులలో ఉన్నతిని సాధిస్తారు. వ్యాపార స్తులకు, రైతులకు లాభాలు. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 75 శాతం అనుకూలత, 25 శాతం ప్రతికూలత ఉంది.
మకరం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. చేసే పనులలో సంతృప్తి. ఆకస్మిక ధనలాభం, అనుకున్న పనులు పూర్తవుతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో జాప్యం జరుగుతుంది. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం లభిస్తుంది.- విద్యార్థులకు చదువులలో శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్యలాభాలు. ఉద్యోగస్తు లు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
కుంభం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. ప్రయాణాలు చేస్తారు. తొందరపాటు పనికిరాదు. మిత్రులతో విరోధం కలుగుతుంది. ధనవ్యయం అవుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో ఆలస్యమవుతుంది. విద్యార్థులకు శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులు, రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది.
మీనం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అనుకోని ఖర్చులు వస్తాయి. బంధువులతో భేదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. విద్యార్థులకు చదువులలో పట్టుదల, ఉత్సాహం అవసరం. వ్యాపారస్తులు, రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు అనారోగ్యానికి గురవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.