19-05-2025 04:55:36 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): దక్షిణ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో ఇద్దరు అనుమానితులను భారత సైన్యం అరెస్టు చేసింది. షోపియన్‌లోని డికె పోరా ప్రాంతంలో ఆర్మీకి చెందిన 34 ఆర్ఆర్ షోపియన్ పోలీసులు, సిఆర్‌పిఎఫ్ 178 బెటాలియన్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. షోపియన్ జిల్లాలోని పోలీసులు మాట్లాడుతూ... ఉగ్రవాదంపై జరిగిన ఒక ముఖ్యమైన ఆపరేషన్‌లో ఎస్ఓజీ షోపియన్, సీఆర్పీఎఫ్ 178, బీఎన్&34ఆర్ఆర్ లతో కూడిన సంయుక్త నాకా ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసింది. వారి దగ్గర నుంచి 04 హ్యాండ్ గ్రెనేడ్‌లు, 02 పిస్టల్స్, 43 లైవ్ రౌండ్లు, ఇతర నేరారోపణ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారి పేర్కొన్నారు.
అనుమానితులలో ఒకరు షోపియన్‌లోని డికె పోరాకు చెందినవారు కాగా, మరొకరు కథువాకు చెందినవారిగా ప్రాథమిక విచారణలో తెలిందన్నారు. ఈ మేరకు వారి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దులో ఉగ్రవాదులు మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడతున్నారు. ఇప్పటికే అక్కడ భద్రతా బలగాలు భారీగా మోహరించి, భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయాత్నించిన ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మరోవైపు జమ్మూలో ఉంటున్న ఉగ్రవాదలుపై కూడా వేట కొనసాగుతోంది.