calender_icon.png 17 July, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ ప్రభుత్వంలో అప్రకటిత ఎమెర్జెన్సీ

10-06-2025 11:54:16 PM

రాజ్యాంగం మనుగడ కష్టమైంది.. 

రాజ్యాంగ పరిరక్షణ కోసం లక్షలాది మందితో భారీ సభ నిర్వహిస్తాం.. 

ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్.. 

హైదరాబాద్ (విజయక్రాంతి): కేంద్రంలో బీజేపీ అధికారంలోరకి వచ్చాక రాజ్యాంగం మనుగడ కష్టమైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్(Congress MLC Addanki Dayakar) విమర్శించారు. మోదీ ప్రభుత్వంలో అప్రకటిత ఎమెర్జెన్సీ నడుస్తున్నదని విమర్శించారు. మంగళవారం గాంధీభవన్‌లో రాజ్యాంగ పరిరక్షణ కమిటీ సమావేశం సంవిధాన్ బచావో కమిటీ చైర్మన్ వినయ్‌కుమార్ అధ్యక్షతన జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు రాజ్యాంగ విలువలు తెలియజేసేందుకే కార్యాచరణ నిర్ణయిస్తున్నట్లు తెలిపారు.

రాజ్యాంగ పరిరక్షణ పేరుతో లక్షలాది మందితో భారీ బహిరంగ సభను నిర్వహించాలని చర్చించినట్లు తెలిపారు. సంవిధాన్ బచావో కార్యక్రమాన్ని రాహుల్‌గాందీ తెలంగాణ నుంచే మొదలు పెట్టాలని నిర్ణయించారని, అందులో జై సంవిధాన్ కమిటీ నియమించారని డాక్టర్ వినయ్‌కుమార్ తెలిపారు. కేంద్రం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే.. రాజ్యాంగబద్ద సంస్థలతో అక్రమ కేసులు బనాయించి గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. పార్టీ నేత ఆత్రం సుగుణ మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కుతో పార్లమెంట్‌లో కూర్చున్న అమిత్‌షా అంబేద్కర్‌నే అవమానించారని విమర్శించారు. తమ హక్కుల కోసం ఉన్న రాజ్యాంగాన్ని , అంబేద్కర్‌ను గౌరవించుకుంటామని తెలిపారు. 

ప్రజలతో ప్రజాప్రతిధులు..

కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్‌లో చేపట్టిన ప్రజలతో ప్రజాప్రతిధుల కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. మొదటి రోజు ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ హాజరయ్యారు. వీరికి  వివిధ సమస్యలపై  ప్రజల నుంచి 25 అర్జీలు వచ్చాయి. కొన్ని దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారులో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు.