calender_icon.png 2 July, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిగాచి ఘ‌ట‌న దురదృష్టకరం..!

01-07-2025 08:05:29 PM

పాశ‌మైలారంలో ప‌ర్య‌టన 

బాధితుల‌కు అండ‌గా ఉంటాం..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

ప‌టాన్‌చెరు: పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్ పరిశ్రమలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరం అని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం సిగాచి పరిశ్రమను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బిజెపి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరితో కలిసి పరిశీలించారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని, పరిశ్రమ ఆవరణను పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కిషన్ రెడ్డికి వివరించారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాదారు. హైదరాబాద్ పరిసరాలలో ఇంతటి భారీ పేలుడు ఈ మధ్యకాలంలో జరగలేదన్నారు.

తమ నాయకులు చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటికే 46 మంది మృతి చెందారని, 13 మంది ఆచూకీ లేదని మిగతా వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. భారీ స్థాయిలో పేలుడు జ‌ర‌గ‌డంతోనే ఇంతటి విధ్వంసం జరిగినట్లు తెలుస్తుందన్నారు. ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ తోపాటు రాష్ట్ర ఏజెన్సీలు కూడా సహాయక చర్యలు పాల్గొన్నాయని తెలిపారు. ప్రమాదం జరిగినట్లు తెలియగానే ప్రధానమంత్రికి  వివరించామన్నారు. మృతులకు రెండు లక్షలు, గాయపడిన వారికి 50 వేల చొప్పున కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు.