23-04-2025 12:00:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్, ఢిల్లీలోని కేపీఎష్ 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ నుంచి 20 మంది విద్యార్థులు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష-2024లో ర్యాంకులు సాధించారు. తమ విద్యార్థులు ఉన్నత ర్యాంకులు సాధించటం చాలా గర్వకారణం అని అకాడమీ చైర్మన్ పి కృష్ణప్రదీప్ అన్నారు.
ఈ అకాడమీ నుంచి టాప్ ర్యాంకర్లలో కొంతమంది.. అమన్ తివారి ర్యాంక్ (74), పుల్కిత్ బన్సల్ (155), ఆశిష్ రఘువంషి (202), రిశికా (217), హేమంత్ శంకర్ (223), సాయి రోహన్ (892) ఉన్నారు. ఈ సందర్భంగా పి. కృష్ణప్రదీప్ మాట్లాడుతూ.. తమ విద్యార్థుల విజయం ఎంతో గర్వకారణమన్నారు.
తమ అకాడమీ వారి లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన మార్గ నిర్దేశం అణువణువునా అందించారన్నారు. డైరెక్టర్ డాక్టర్ భవానీ శంకర్ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.