13-08-2025 12:00:00 AM
మాజీ జెడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు
ఇల్లంకుంట ఆగస్టు 12 (విజయక్రాంతి): ఎద్దు ఏడ్చిన ఎవుసం... రైతు కన్నీరు పెట్టిన రా జ్యం నిలువదు... రైతు రాజ్యం తీసుకొస్తామని ఎన్నికల్లో దొంగ హామీలిచ్చి అడ్డదారి లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం రైతులను కన్నీరు పెట్టిస్తోందని జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు అన్నారు. రైతులకు యూరియా సరఫరా చేయాలని ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో రోడ్డుపై బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ధర్నా చేశారు.
అనంతరం సిద్ధం వేణు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న రైతులకు ఇచ్చిన ఏ హామీ ఒక్కటి నెరవేరలేదని, హామీ ని ప్రభుత్వం పూర్తి చేయలేదని విమర్శించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే రైతు లకు ఇబ్బంది లేకుండా యూరియా ఇవ్వాలన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరి యా కొరత లేదని, సరిపడా నిల్వలున్నాయ ని జిల్లా వ్యవసాయ అధికారి రాత్రికి రాత్రి ప్రకటన చేయడం హాస్యాస్పదంగా ఉందని, యూరియా కొరత లేకుంటే రైతులు రాత్రి, పగలు తేడా లేకుండా యూరియా కోసం లై న్లు ఎందుకు కడుతున్నారని, జిల్లా వ్యవసా య అధికారి బస్తాకు కొంత కమీషన్లు తీసుకుని డీసీఎంఎస్, ఆగ్రోస్ వాళ్లకు కేటాయిస్తున్నారని ఆరోపించారు.
జిల్లాలో ఇంత జరు గుతున్నా జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారని, కనీసం ఎక్కడ రైతుల సమస్యలు అడిగి తెలుసుకోవడం లేదన్నారు. జిల్లాలో విజిలెన్స్ అ ధికారులు మొద్దు నిద్ర పోతున్నారని, ఎమ్మె ల్యే, ఎంపీలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయించాలని డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడమే కాదని, రైతులకు సరిపడా ఎరువులు ఇవ్వాలని డిమాం డ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి రాజిరెడ్డి పార్టీ సీనియర్ నాయకులు ఒగ్గు నర్సయ్య, కముటము రాములు, బిళ్ళవేని పరశురాములు, ఉడతల వెంకన్న, బొల్లం వెంకటేష్, రవీందర్ గౌడ్, కేశవేణి శ్రీనివాస్, పట్నం శ్రీనివాస్, కూనబోయిన రఘు, ఆకు ల శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, అంతగిరి భాస్కర్, మహేందర్, రవీందర్ రెడ్డి, పిల్లి వేణు, గుంటి మధు, బుర్ర బాలకిషన్, దయ్యాల మహేష్, ఎండి సమీర్, హరి కుమార్, శ్రీనివాస్ యాదవ్, రాజు, రాజేందర్, నరేష్ గౌడ్, అర్జున్, వేణు తదితర నా యకులు పాల్గొన్నారు.