10-05-2024 12:53:50 AM
తరగతి గదిలో లైంగిక వేధింపులు
బాధితుడి తండ్రి ఫిర్యాదు.. నిందితురాలి అరెస్ట్
న్యూయార్క్, మే 9: యూఎస్‌లోని విస్కాన్సిన్‌లో దారుణం చోటుచేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలు 11 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. బాధితుడి మొబైల్‌కు వచ్చిన సందేశాలను చూసి తండ్రి విషయం తెలుసుకున్నాడు. తర్వాత పోలీసులను ఆశ్రయిం చడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మాడిసన్ బెర్గ్‌మాన్ అనే 23 ఏళ్ల టీచర్ ఐదో తరగతి చదువుతున్న ఓ బాలుడిపై కన్నేసింది. తరగతి గదిలో ఎవరూ చూడకుండా అతడిని తాకేందుకు ఏర్పాట్లు చేసుకుని అప్పుడప్పుడు అభ్యంతరకరంగా తాకేది. బాలుడి తండ్రికి విషయం తెలియడంతో ఆయన పోలీసులను ఆశ్ర యించాడు. సెయింట్ క్రోయిక్స్ కోర్టు ఈ కేసును విచారించగా విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. స్కూల్ ముగిసిన తర్వాత బాలుడిని ఉండిపొమ్మని ఉపాధ్యాయురాలు బలవంతం చేసేది. విరామ సమయాల్లో బాలుడిని ముద్దుపెట్టుకునేది. తరచూ బాలుడి మొబైల్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపేది. నేరం నిరూపితం కావడంతో టీచర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై గతంలో నూ లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి.