calender_icon.png 22 August, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి జ్ఞాపకార్థం గ్రామానికి వైకుంఠ రథం

22-08-2025 01:14:11 AM

ముడిమ్యాలకు డొనేట్ చేసిన గోనె కరుణాకర్ రెడ్డి

చేవెళ్ల, ఆగస్టు 21:చేవెళ్ల మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, బీఆర్‌ఎస్ సీనియర్ నేత గోనె కరుణాకర్ రెడ్డి తన తల్లి జ్ఞాపకార్థం స్వగ్రామానికి వైకుంఠ రథాన్ని విరాళంగా అందించారు. చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామానికి చెందిన ఆయన తన తల్లి వినోదమ్మ స్మారకార్థం వాహనాన్ని కొనుగోలు చేసి, వైకుంఠ రథంగా తయారు చేయించారు. గురువారం గ్రామ పెద్దలు గోనె నరేందర్ రెడ్డి, రాం రెడ్డి, మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి, గ్రామ సెక్రటరీ షమీమ్ సు ల్తాన్ సమక్షంలో రథాన్ని పంచాయతీకి అప్పగించారు.

ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి దాతృత్వాన్ని అభినందిస్తూ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నియో జకవర్గ యూత్ ప్రెసిడెంట్ వంగ శ్రీధర్ రెడ్డి, ఉద్యమకారుడు శేరి రాజు, సీనియర్ నేతలు శేరి దర్శన్, శ్రీనివాస్, ఆరిఫ్ మియా, గోనె మాధవరెడ్డి, ఊరడి రాములు, ఊరడి వెంకటేశ్, బేగరి శివకుమార్, జుకంటి కృష్ణ, గోనె రాఘవేందర్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి, గౌడిచర్ల రవి, సూర్యాపేట మహేందర్ గౌడ్, ఊరడి సురేష్, నాందరి రాములు, ఊరడి రజినీకాంత్, ఎర్రవల్లి లక్ష్మయ్య తదితరులుపాల్గొన్నారు.