24-12-2025 12:40:37 AM
వెంకటాపూర్, డిసెంబర్23(విజయక్రాంతి):మండలంలోని చక్రవర్తిపల్లె గ్రామ పంచాయితీ పరిధిలోని పోరకలపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం విజయగిరి స్వరూప రమేష్ కుటుంబంలో విషాదం చో టుచేసుకుంది. అనారోగ్య కారణాలతో శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో స్వరూప మృతి చెందారు. ఈ కుటుంబం తీవ్రమైన పేదరికంలో జీవనం కొనసాగిస్తు న్న విషయం తెలిసిన గ్రామస్తులు మానవ తా దృక్పథంతో ముందుకు వచ్చారు.
ద హన సంస్కారాల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రమేష్ కుటుంబానికి ఆనండాపురం గ్రామస్తులు కలిసి రూ. 25,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు మేక ర మేష్, అజ్మీరా రాజు నాయక్, రెడ్డి వెంకటేష్, చాతరాసి లావణ్యతో పాటు గ్రామస్తులు శేరి ఐలయ్య, శిరంశెట్టి సాగర్, తుమ్మల రమణారెడ్డి, భూక్య రాము నాయక్, అజ్మీరా రమేష్ తదితరులు పాల్గొన్నారు.