calender_icon.png 5 July, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాధనం వృథా

04-06-2025 12:00:00 AM

  1. చౌరస్తాల పునరుద్ధరణకు కోట్లు ఖర్చు 
  2. నిర్మించడం ఎందుకు... కూల్చడం ఎందుకు...?
  3. ఓట్ల కోసం నాయకులు ఏమైనా చేస్తారు...
  4. ఆలోచించాల్సింది అధికారులే..
  5. ట్రాఫిక్ సిగ్నల్స్ లేక రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృతి

అదిలాబాద్, జూన్ 3 (విజయకాంతి):  ఓట్ల కోసం.. సీట్ల కోసం.. లీడర్లు ఏమైనా చేస్తారు. ఎన్ని అమలు కానీ హామీలైనా ఇస్తా రు... అభివృద్ధి పనుల పేరిట కోట్ల రూపాయ ల ప్రజాధనం వృథా అవుతున్న వారికే మి చింత ఉండదు... కానీ ఆ అభివృద్ధి పనుల తో ప్రజలకు  లాభమెంత.. నష్టమెంత అని ఆలోచించి అమలు చేయాల్సింది మాత్రం అధికారులే. కానీ ఆదిలాబాద్‌లో నాయకుల మెప్పు కోసం, వారి ఆర్భాటం కోసం అధికారులు చేసిన తప్పిదానికి కోట్ల ప్రజాధనం వృథా అవ్వడమే కాకుండా ఎంతో మంది ప్రజలు పాణాలు కోల్పోయారు.

అధికారులు చేసిన ఇలాంటి తప్పిదమే ఆదిలాబా ద్‌లో సైతం జరిగింది. పట్టణ సుందరీకరణ పేరిట అవకాశం లేని కూడళ్లలో విశాలమైన చౌరస్తాలను నిర్మించారు. కానీ టాఫిక్ సిగ్న ల్స్ లేకపోవడంతో తరుచు రోడ్డు ప్రమాదా లు జరిగి ప్రజల ప్రాణాలు కోల్పోవడంతో  మళ్ళీ చౌరస్థాని కుదించడానికి ప్రజాధనాన్ని వృథాచేస్తున్నారు. దీంతో అప్పుడు ఎందుకు నిర్మించారు.. ఇప్పుడు ఎందుకు కూల్చుతున్నారు.. ఇదేనా అధికారుల పని తీరు అం టూ స్థానికులు ఆగహం వ్యక్తం చేస్తున్నారు.  

పట్టణ సుందరీకరణ కోసం..

గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ పట్టణ సుందరీకరణ కోసం పలు చౌరస్తాల పునరుద్ధరణకు కోట్లు ఖర్చు చేశారు. దీంతో చిన్నచిన్నగా ఉన్న కొమరం భీమ్ చౌక్, తెలంగాణ తల్లి చౌక్, వివేకానంద చౌక్, నేతాజీ చౌక్, వినాయక్ చౌక్, అంబేద్క ర్ చౌక్‌లను విశాలంగా మార్చి పునరుద్ధరించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ప్రధానంగా  కొమరం భీమ్ కూడలి స్థలం చిన్నగా ఉండగా అక్కడ మాతం విశాలంగా చౌరస్తాను నిర్మించారు. వినాయక్ చౌక్‌లో భారీ టవర్‌ను నిర్మించారు. 

రోడ్డు ప్రమాదాలకు కారణం...

అసలే ఇరుకైన రోడ్లపై విశాలమైన చౌరస్తాలను నిర్మించడంతో, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయకపోవడంతో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొమురం భీం, వినాయక్ చౌక్‌లు నిర్మించిన తర్వాత రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది మృతి చెందిన ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి.

రోడ్డు పమాదాలు జరుగుతుండ టంతో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు, ట్రాఫి క్ పోలీసులు ప్రమాదాల నివారణపై చర్య లు చేపట్టారు. దీంతో కొమరం భీమ్ చౌరస్తాను కుదించాలని నిర్ణయించారు. ఈ మేర కు చౌరస్తా కుదింపు పనులు ముమ్మరంగా చేపడుతున్నారు.  

కుదిస్తున్న చౌరస్తాలు...

ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని విశాలంగా నిర్మించిన చౌరస్తా ల ను కుదిస్తున్నారు. నిర్మాణానికి ఖర్చు, కూల్చడానికి ఖర్చు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ఇది ముమ్మాటికీ అధికారుల తప్పిదమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. చౌరస్తాల ను విశాలంగా నిర్మిస్తే రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడతాయని అప్పుడు అధికా రులకు తెలియదా..

అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్ల ఒకసారి వచ్చే నాయకులు కోసం.. వారి స్వార్థం కోసం ఇష్టారీతిగా వివరిస్తారు, పదవీ విరమణ పొందే వరకు ఉద్యోగంలో ఉండే అధికారులు మాతం అన్ని ఆలోచించకుండా నాయకుల్లా వ్యవహరించడం ఏంటని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. 

ప్రమాదాలు జరుగుతాయని.. అప్పుడు తెలియదా..?

ఇరుగ్గా ఉన్న రోడ్డుపై.. అప్పుడు విశాలంగా చౌరస్తాలు నిర్మించడం ఎందుకు.. మళ్ళీ ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చౌరస్థలను కూల్చడం ఎందు కు? అప్పుడు కట్టడానికి ఇప్పుడు కూల్చడానికి ప్రజాధనం వృథా అయినట్లే కదా. అధికారులు ఏ మాతం ఆలోచించకుండా ప్రజాధనాన్ని వృథా చేయడం ఎంత వరకు సమంజసం, అప్పుడు ఇంజినీర్లకు రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని తెలియదా అని ప్రశ్నిస్తున్నాం.

 గణేష్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి