03-01-2026 12:08:51 AM
ఉప్పల్ జనవరి 2 (విజయక్రాంతి): 2025 డిసెంబర్ నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కర్ణాటక రాష్ట్రం ఐఐటీ ధార్వాడ్లో చదువుతున్న విద్యార్థులు రేపక భర్గవి, సుధీర్ ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన నెలరోజుల ఇంటర్ షిప్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. డా. శ్రీను నాయక్ (హెచ్‌ఓడీ), ప్రొఫెసర్ ఎస్. ఇలయ్య మార్గదర్శకత్వంలో వారు నీటి కలుపు (వాటర్ హైసింత్) నుంచి కాగితం తయారీపై ‘వెస్ట్ టు వెల్త్’ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు.
సాధారణంగా చెరువులు, కాలువల్లో వ్యర్థంగా మారి పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే నీటి కలుపును వినియోగించి కాగితం తయారు చేయడం ద్వారా కాలుష్య నియంత్రణతో పాటు ప్రకృతి వనరుల సంరక్షణ సాధ్యమవుతుందని విద్యార్థులు వివరించారు. ఈ ప్రాజెక్ట్ విద్యార్థుల పరిశోధనా ప్రతిభకు నిదర్శనంగా నిలిచిందని, భవిష్యత్తులో పరిశ్రమ ల స్థాయిలో అమలు చేసే అవకాశాలు ఉన్నాయని అధ్యాపకులు అభిప్రాయపడ్డారు.