06-06-2025 12:44:39 AM
11 ఏండ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, జూన్5: దశాబ్దకాలంగా సాగిన ఏన్‌డీఏ పాలనలో ప్రజల స్వయం సమృద్ధికి, వారిని పేదరికం నుంచి బయటపడేసేందుకు పలు విప్లవాత్మక నిర్మయాలు తీసుకున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమానికి ఎన్‌డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని గురువారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దేశంలోని ప్రతిఒక్కరూ గౌరవంగా జీవించడానికి వీలుగా.. సమ్మిళి, స్వయంసమృద్ధి భారత్‌ను తయారుచేసేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని వెల్లడించారు.
తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపాయని పేర్కొన్నారు. ‘పీఎం ఆవాస్ యోజన, పీఎం ఉజ్వల యోజన, జన్‌ధన్, ఆయుష్మాన్ భారత్ వంటివి ప్రజలకు ఇండ్లు, స్వచ్ఛమైన ఇందనం, బ్యాంకి ంగ్, హెల్త్‌కేర్, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాయి. 25కోట్ల మందికిపైగా పేదరి కం నుంచి బయటపడ్డారు’ అని ప్రధాని పేర్కొన్నారు. మూడో దఫా మోదీ ఏర్పడి జూన్ 9 నాటికి సంవత్సరం పూర్తికానుంది.
దీంతో ఆయన 11 ఏళ్లపాటు నిరంతరాయం గా ప్రధాని పదవిలో కొనసాగినట్టవుతుంది. ఈ సందర్భంగా బుధవారం ప్రధాని మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి, ప్రసం గించారు. ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని, వాటిని సాధించేందుకు ఉత్సాహంగా పనిచేయాలని సహచరులకు సూచించారు. ప్రభు త్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.