04-07-2025 12:49:28 AM
- 1437 మందికి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పత్రాలు
- మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ జూలై 3 (విజయ క్రాంతి) : దళారి వ్యవస్థ లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణం లోని శిల్పారామం లో నగరపాలక సంస్థ పరిధికి చెందిన లబ్దిదారులకు ఆయన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పట్టణంలో దైబజార్ రద్దు చేశామని, ఇలా ప్రతి అంశంలో పారదర్శకంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని స్పష్టం చేశారు. పలువురికి ఎల్‌ఓసి అందించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, టి పిసిసి అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, టి పిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, ఎన్ పి వెంకటేష్, మారేపల్లి సురేందర్ రెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, అవేజ్, ఫయాజ్, సిజె బెనహార్, అజ్మత్ అలి, ఎస్సీ సెల్ చైర్మన్ సాయి బాబా, ఐఎన్టీయుసి రాములు యాదవ్, జహీర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు , మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తదితరులుపాల్గొన్నారు.