calender_icon.png 29 May, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెల్లో పెట్టి చూసుకుంటున్నాం

28-05-2025 12:36:42 AM

  1. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం 

లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో

దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి 

దేవరకద్ర మే 27 : ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టి చూసుకుంటున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం ధమగ్న పూర్ లో సీసీ కుంట, కౌకుంట్ల మండల వాసులకు, మదనపురం మండలం లోని ఎంపిడివో కార్యాలయంలోమదనపురం మండలం కు చెందిన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్,  సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు జి. మధుసూదన్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సముచితస్థానం లభిస్తుందని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.