19-09-2025 01:03:15 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ‘ఏ శాఖలో లేని విధంగా పూర్తిపార దర్శకంగా ఆర్‌అండ్‌బీ శాఖలో ప్రమోషన్లు ఇచ్చాం. ఇప్పుడు ఇంజినీర్లు, అధికారులు కృషి అర్‌అండ్‌బీ శాఖకు మంచి పేరు తీసుకొచ్చే బాధ్యత మీపైనే ఉంది. శాఖపరమైన సమస్యలేమైనా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తా’ అని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.
నూతనంగా ఎన్నికైన ఆర్ అండ్‌బీ ఇంజినీర్స్ అసోసియేషన్ కార్యవ ర్గం మంత్రి కోమటిరెడ్డిని గురువారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదా యంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకేసారి 118 మంది ఏఈఈలు డీఈలుగా ప్రమోషన్స్ పొందారు. 72 మంది డీఈలు ఈఈలుగా, 29 మంది ఈఈలు ఎస్‌ఈ, సీఈలుగా, 6 గురు సీఈ ల్లో ఇద్దరు ఈఎన్‌సీలుగా ప్రమోషన్ పొందారన్నారు.
మంత్రిని కలిసిన వారిలో ఇంజినీర్స్ అసోసియేన్ అధ్యక్షుడు శ్రీను, ప్రధాన కార్యదర్శి రాంబాబు, శరత్ చంద్ర, మహేందర్ కుమార్, సంధ్య వేణు, ప్రదీప్‌రెడ్డి, నవీన్, కిషన్, అరుణ్‌రెడ్డి ఉన్నారు.