calender_icon.png 30 January, 2026 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని మున్సిపాలిటీల్లో గెలవాలి

30-01-2026 01:56:30 AM

  1. కాంగ్రెస్ విజయానికి ప్రతి ఒక్కరూ కష్టపడాలి 
  2. నిజామాబాద్ పార్లమెంట్ సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): మున్పిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. నాయకులందరూ సమష్టిగా పనిచేసి .. అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపిం చుకోవాలని మంత్రి సూచించారు. మన్సిపల్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గానికి సంబంధించి సన్నాహక సమావేశం పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన గురు వారం గాంధీభవన్‌లో జరిగింది.

ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, పార్లమెంట్ నియోజకవర్గం ఇన్‌చార్జ్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసిన విధంగానే.. మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రతి నాయకుడూ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయా లన్నారు. పార్టీ అభ్యర్థుల విజయాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యూహాలు, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అంచనా వేసుకుని ముందుకు సాగాలన్నారు.

ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలన్నారు. నిజామాబాద్ పార్ల మెంట్ పరిధిలోని కార్పొరేషన్, మున్సిపాలిటీలను పూర్తిగా కైవసం చేసుకోవాలన్నారు. ఈ సమా వేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, పార్టీ నేతలు నగేష్‌రెడ్డి, రామకృష్ణ, అనిల్ కుమార్, వేణు తదితరులు పాల్గొన్నారు.