calender_icon.png 2 November, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనమేమిటో శత్రు దేశానికి చూపాం

01-11-2025 12:29:48 AM

  1. మన సత్తా ఎంటో ఉగ్రవాదులకు తెలిసింది
  2. ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసింది
  3. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతాం ప్రధాని మోదీ
  4. సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవం
  5. గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద పటేల్‌కు నివాళి

గుజరాత్, అక్టోబర్ 31:‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా భారత్ బలాన్ని ప్రపంచం మొత్తం చూసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ     అన్నారు.మన దేశం నిజమైన బలం ఏంటో శత్రుదేశానికి తెలిసిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లబాయి పటేల్ 150వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పటేల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు.‘ఆపరేషన్ సిందూర్’ అంశాన్ని ప్రస్తావించారు. ఈ ఆపరేషన్ ద్వారా భారత్ తన శత్రుదేశ భూభాగంలోకి ప్రవేశించి దాడి చేయగలదన్న స్పష్టమైన సందేశాన్ని ప్రపంచానికి పంపిందని మోదీ పేర్కొన్నారు ‘ఎవరైనా మనదేశం వైపు కన్నెత్తి చూసే సాహసం చేస్తే.. భారత్ వారి భూభాగంలోకి చొరబడి మరీ దెబ్బకొడుతుందని ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచమంతా చూసింది.

మన దేశం నిజమైన బలం ఏంటో పాక్, ఆ ఉగ్రవాదులకు తెలిసింది’ అని ప్రధాని వ్యాఖ్యా నించా రు. దేశ భద్రత విషయంలో తమ ప్రభుత్వ దృఢ వైఖరి సర్దార్ పటేల్ ఆశయాలకు అనుగుణంగానే ఉందని ఈ సం దర్భంగా ప్రధాని పేర్కొన్నారు. చరిత్ర రాయడంలో సమయం వృథా చేయకూడదని, దానిని సృష్టించాలని  పటేల్ విశ్వసించారని, దానికి తగ్గట్టే భారతదేశాన్ని ఏకం చేసి చరిత్ర సృష్టిం చారని మోదీ కొనియాడారు.

స్వా తంత్య్రం తర్వాత 550 సంస్థాలను ఏకం చేసి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేశారని, పటేల్‌కు ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ దార్శనికత అత్యంత ముఖ్యమైందన్నారు. దానిని మేం సమర్ధిస్తాం.. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల మాదిరిగానే ఎక్తా దివస్‌ను జరుపుకొంటున్నాం అని ప్రధాని పేర్కొన్నారు. భారతీ యులంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని, విభజన శక్తులకు దూరంగా ఉండాలని, దేశ సమగ్రతకు నక్సలిజం ముప్పుగా పరిణమించింది అని పేర్కొన్నారు. నక్సల్స్ ఏరివేత కోసం ఎన్నో ఆపరేషన్స్ చేశాం.

నక్సలిజం మూలాలను సమూలంగా పెకలి స్తామని మోదీ స్పష్టం చేశారు. కశ్మీర్ మొ త్తాన్ని భారత్‌లో కలపాలని పటేల్ ఆకాంక్షించారని, అయితే పటేల్ అభిప్రాయాన్ని నెహ్రూ గౌరవించలేదు.. పైగా పటేల్, అంబేద్కర్‌ను కాంగ్రెస్ అవమానించింది అని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పటేల్ ఆశయాలను పూర్తిగా మరిచిపోయిందని ఆరోపించారు.కాంగ్రెస్ చేసిన తప్పు వల్లే కశ్మీర్‌లో కొంత భాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించింది.

దానివల్ల కశ్మీర్, దేశంలో అశాంతి నెలకొంది. ఉగ్రవాదాన్ని దాయాది దేశం పెంచి పోషించింది.ఇంత జరిగినా ఉగ్రవాదుల ముందు కాంగ్రెస్ తలవంచిందని మోదీ మండిపడ్డారు.అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటుంటే కొందరికి బాధగా ఉంటుంది.. దేశం నుంచి చొరబాటుదారులను తరిమికొట్టాలని ప్రతిజ్ఞ చేద్దామని మోదీ పేర్కొన్నారు.

పటేల్‌కు రాష్ట్రపతి, ప్రధాని నివాళి

భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నివాళులర్పించారు. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని మోదీ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పటేల్ విగ్రహంపై హెలికాఫ్టర్ నుంచి పూలవర్షం కురిసింది. అనంతరం ఏక్తా దివస్‌ను పురస్కరించుకొని ప్రత్యేక పరేడ్ ఏర్పాటు చేశారు. ఇందులో సైనిక దళాల కవాతు ఆకట్టుకుంది.

కాగా సైనిక దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన మోదీ.. అనంతరం వారికి సెల్యూట్ చేశారు. సాయిధ దళాలు, స్థానికులతో కలిసి ప్రధాని ఐక్యతా ప్రమాణం చేశారు. సైనిక బలగాల విన్యాసాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నా. ఈ క్రమంలోనే గుజరాత్, జమ్మూకశ్మీర్, అండమాన్ నికోబార్, మణిపుర్, మహారాష్ట, ఛత్తీస్‌గడ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరికి చెందిన శకటాలు ఆకర్షణగా నిలిచాయి.