calender_icon.png 4 September, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాదులకు జీవం పోస్తాం

01-09-2025 02:00:18 AM

  1. కడియం శ్రీహరి

మేడిగడ్డలాంటి మేడిపండు ప్రాజెక్టులు మాకొద్దు: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

యూరియాపై  బీజేపీ, బీఆర్‌ఎస్ దొంగ డ్రామాలు: కేఆర్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలో నిర్ల క్ష్యానికి గురైన దేవాదుల ఎత్తిపోతల పథకానికి తమ కాంగ్రెస్ ప్రభుత్వం జీవం పోస్తోం దని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి, దేవాదుల లాంటి వరప్రదాయినిని గత పాలకులు అటకెక్కించారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు.

ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన ప్రాధాన్యత దేవాదులకు ఇవ్వలేదు’ అని ఆరోపించారు. తమ ప్రభుత్వం మేడిపండు లాంటి మేడిగడ్డ ప్రాజెక్టులకు కాకుండా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యేవాటికి ప్రాధాన్యమిస్తోందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చెప్పారు. యూరియా కొరతపై ప్రతిపక్షాలు డ్రామాలు ఆడుతున్నాయని వర్ధన్నపే ట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మండిపడ్డారు.