06-12-2024 12:59:27 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 5(విజయక్రాంతి): సర్కార్ క్రీడా రంగాన్ని బలోపేతం చేస్తుందని, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని కంటో న్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగం గా గురువారం జింఖానా గ్రౌండ్‌లో 2కే రన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫుట్‌బాల్ క్రీడాకారుడైన సీఎం రేవంత్‌రెడ్డి క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ ఉపసంచాలకుడు జి.ఆశన్న, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సుధాకర్ పాల్గొన్నారు.