calender_icon.png 27 August, 2025 | 10:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలను విస్మరిస్తే ఊరుకోం

12-12-2024 12:09:29 AM

  1. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏమైంది?
  2. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి):  బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌తోపాటు ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చిన ఇతర హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలన్నారు. తెలంగాణ వడ్డెర సంఘం నాయకులు ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో బుధవారం కలిసి స్థానికసంస్థల్లో రిజర్వేషన్ల పెంపుపై బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు నివేదిక  ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రతి జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో బీసీ ఐక్యత భవనాలను నిర్మిస్తామని ఇచ్చిన హామీ అమలుపై కనీస చర్యలు తీసుకోలేదని విమర్శించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీ అమలులో తాత్సారం చేయొద్దని సూచించారు. కులవృత్తులకు ప్రభుత్వం కనీస మద్ధతు ఇవ్వడం లేదని మండిపడ్డారు.

జగిత్యాల జిల్లా సారంగాపూర్ కేజీబీవీలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారనే వార్త ఆందోళన కలిగించిందని కవిత అన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే సంక్షేమ పాఠశాలలను సందర్శించాలన్నారు. సమీక్ష చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.