18-01-2026 01:21:53 AM
హైదరాబాద్, జనవరి 17(విజయక్రాంతి): బీసీల ఆత్మగౌరవం కోసం, సమాన హక్కుల కోసం ఆత్మబలిదానం చేసుకొని అసువులు బాసిన బీసీ బిడ్డ, అమరుడు సాయి ఈశ్వర్ చారి కుటుంబానికి ఇచ్చిన మాటను తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలబెట్టుకుంది. సాయి ఈశ్వర్ చారి ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం 5 లక్షల రూపాయల చొప్పున, మొత్తం 15 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం చెక్కులను పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శనివారం పార్టీ కార్యాలయంలో స్వయంగా కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ మాట తప్పని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ‘బీసీల హక్కుల కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన సాయి ఈశ్వర్ చారి మరణం అత్యంత బాధాకరం అని అన్నారు.
మీ పిల్లల బాధ్యత మాది, వారి భవిష్యత్తుకు మేము అండగా ఉంటాం’ అని ఆనాడు మాట ఇచ్చాను. ఈరోజు ఆ మాటను నిలబెట్టుకుంటూ, ముగ్గురు పిల్లల పేరిట 5 లక్షల రూపాయల చొప్పున డిపాజిట్ చేసి, ఆ పత్రాలను వారి తల్లికి అంద జేశామన్నారు. ‘సాయి ఈశ్వర్ చారిని మే ము తిరిగి తీసుకురాలేం, కానీ ఆయన కన్న కలలను, ఆయన కుటుంబ గౌరవాన్ని కాపా డే బాధ్యత తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంటుంది’ అని మల్లన్న పేర్కొన్నారు. ‘సాయి ఈశ్వర్ చారి అంత్యక్రియలకు వెళ్లకుండా ఈ ప్రభుత్వం నన్ను పోలీసులతో గృహనిర్బంధం చేయించింది. ప్రజా సమస్యల మీద పోరాడే గొంతుకను నొక్కాలని చూసింది.. నేను వెళ్లలేకపోయినా.. మా పార్టీ నాయకులు దగ్గరుండి అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఆ మరుసటి రోజే నేను స్వయంగా వెళ్లి ఆ కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పాను. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక సాయం అందించడం మా బాధ్యతగా భావిస్తున్నాను’ అని మల్లన్న పేర్కొన్నారు. ప్రభు త్వం కూడా తక్షణమే స్పందించి ఈ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటిం చాలని ఆయన డిమాండ్ చేశారు. సాయి ఈశ్వరచారీ భార్య కవిత మాట్లాడుతూ తమకు ఇచ్చిన మాట ప్రకారం, ఆర్థికంగా ఇంతటి భారీ సాయం చేసి, పిల్లల చదువులకు, భవిష్యత్తుకు భరోసా కల్పించినందుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెం ట్ సుధగాని హరిశంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు ఓదెలు యాదవ్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజా గౌడ్, రాష్ట్ర నాయకులు నాగ రాజు గౌడ్ మరియు సాయి ఈశ్వర్ చారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.