calender_icon.png 26 January, 2026 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం ఏం చేస్తుంది..?

26-01-2026 12:22:59 AM

  1. కస్తూర్బా గాంధీలో నీటి కటకట

అవస్థలు పడుతున్న200 మంది విద్యార్థినీలు

నీటి కోసం వ్యవసాయ బోర్లే దిక్కు

కాలకృత్యాలకు దేవుడెరుగు

కంపు కొడుతున్న మూత్రశాలలు

నీటి కోసం రోడ్డు బాట విద్యార్థులు

పట్టించుకోని విద్యాశాఖ 

గోపాలపేట / రేవల్లి 25: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా విధానం కోసం ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకోవడమేనా. అన్ని రంగాల లో కెల్లా విద్యారంగం ఎంతో గొప్పదని ప్ర భుత్వం కోట్ల రూపాయలను విద్య రంగానికి ఖర్చు చేస్తుందని గొప్పలు చెప్పడమే తప్ప పాలన కొనసాగించడంలో అద్దంలో ఇక్కడ దర్శనమిస్తుంది.

వనపర్తి జిల్లా రేవల్లి మం డల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఎన్నో సమస్యలు తాండవిస్తున్నా యి. ఈ కస్తూర్బా గాంధీ విద్యాలయం ఆర వ తరగతి నుండి పదవ తరగతి, అదేవిధం గా ప్రథమ ద్వితీయ తరగతులు కూడా ఇక్క డే కొనసాగుతున్నాయి. ఈ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో సుమారుగా 200 మంది విద్యార్థినీలు పలు గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు.

ఈ పాఠశాలలో విద్యార్థులు పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సంగతి పలువురికి అర్థం పట్టినట్టుగా కనిపిస్తుంది. ఆహార భోజన సం గతి పక్కన పెడితే ఆ విద్యార్థి నీలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి కనీసం నీరు లేకపో వడం శోచనీయం. 

 విద్యార్థినీల ఇబ్బందులు విద్య శాఖ కు తెలియదా ? 

ఇక్కడ విద్యనాభ్యసించేది బాలికలే మరి నీరు లేకుంటే ఎన్ని ఇబ్బందులు పడతారో విద్యాశాఖకు తెలియదా అని విద్యార్థినీల తల్లి దండ్రులు వాపోతున్నారు. కస్తూర్బా గాంధీ విద్యాలయం నుంచి విద్యార్థినిలు గేటు దాటని వసతి అక్కడి అధ్యాపకులు ఉ పాధ్యాయులు కల్పించాలి. ఈ సమయంలో విద్యార్థినిలు బిందెలు బకెట్లు వెంట తీసుకొని వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తుంటే అక్కడ ఏమైనా ప్రమాదం సంభవిస్తే దానికి ఎవరు సమాధానం చెబుతారు .

గత మూ డు రోజుల నుండి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో నీరు లేకుంటే విద్యాశాఖ ఏం చే స్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థినీలను బయటకు పంపకుండా విద్యాశాఖ తా గునీటి ట్యాంకులతో గాంధీ విద్యాలయానికి సరఫరా చేయాల్సి ఉంది. కానీ అవి ఏవి లెక్కచేయకుండా ఇలా విద్యార్థినీలను రోడ్డుపైకి పంపిస్తే కాపు కాసే ఆకతాయిలు వారిని ఏమైనా చేస్తే విద్యాశాఖ సమాధానం చెబుతుందా.

ఈ ప్రభుత్వం ఎందుకు ఇలా నిర్ల క్ష్యంగా ఉందో సమాధానం చెప్పాలని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. మూడు రోజుల నుండి నీరు లేకపోవడం పట్ల విద్యార్థినీలు వారి కాలకృత్యాలకు ఎన్ని ఇబ్బందులు ప డుతున్నారో ఆలోచించాలి. భగీరథ నీళ్లు రాక మూడు రోజులు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ గ్రామపంచాయతీ కానీ ఏమైనా చర్యలు చేపట్టారు.

ఇంత సున్నితమైన విషయాన్ని ఎందుకు మరుస్తున్నారు ఆలోచించాలి. వి ద్యా శాఖలో పని చేస్తున్న ఎంఈఓ ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మూడు రో జుల నుండి నీరు లేకఇక్కడి విద్యార్థినిలు స్నానాలు చేయడం లేదని శుభ్రంగా ఉండలేకపోతున్నా సంగతి ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది.

 పట్టించు కోని అధికారులు ? 

 రేవల్లి మండల కేంద్రంలో రోడ్డు వెంట విద్యార్థులు నీటి కోసం వెళుతుంటే గ్రామపంచాయతీ కానీ ఆ గ్రామ సర్పంచ్ గాని ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.తమ సమస్యను అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నీటి సౌకర్యాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి కైనా విద్యాశాఖ చొరవ తీసుకొని వెంటనే కస్తూర్బా గాంధీ విద్యాలయంలో బోరును తవ్వించి నీటి సమస్యను తీర్చాలని విద్యార్థినిలు కోరుతున్నారు. 

అంతేకాకుండా బోరు బావి తొవ్వించే వరకు ట్యాంకుల ద్వారా కస్తూర్బా గాంధీ విద్యాలయంలో నీ విద్యార్థులకు ట్యాంకుల ద్వారా నీటిని ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

పాఠశాలకు బోరు బావి ఉంటే ఇబ్బంది ఉండదు 

గ్రామపంచాయతీ వారు ఈ పాఠశాలలో నీటి సరఫరా చేయడానికి మూడు రోజుల నుండి ట్యాంకర్ల ద్వారా ఇక్కడు న్న సంపును నింపుతున్నారు. ఈరోజు గ్రామంలో ఉన్న బోరు బావి మోటారు కాలిపోవడం పట్ల నీటి సరఫరా చేయడానికి ఇబ్బంది పడ్డారు. పదవ తరగతి విద్యార్థులకు ఉదయాన్నే ప్రత్యేక క్లాసు లు ఉండడం పట్ల నీటి కోసం వారి క్లాస్ టీచర్ పక్కనే ఉన్న వ్యవసాయ బోర్డు దగ్గరికి తీసుకెళ్లారు విద్యార్థులు అక్కడే బ్రష్ వేసుకొని ముఖాలు కడుక్కొని వ చ్చారు.

కానీ గ్రామానికి సంబంధించిన పైప్ లైన్ ఇక్కడ ఏర్పాటు చేశారు. దానివల్ల అప్పుడప్పుడు నీటి కొరత ఏర్ప డుతుంది. సంబంధిత కాంట్రాక్టర్ భవ నం నిర్మించి బోరుబావిని తవ్వించాడే గాని నీటి సప్లై మాత్రం ఏర్పాటు చేయలేదు ఇక్కడ ఒకటి ప్రత్యేక బోరుబావి ఉండి నీరు పుష్కలంగా ఉంటుంది

జ్యోతి,  ప్రిన్సిపాల్