calender_icon.png 12 October, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సోయా’ ఎప్పుడు కొంటరు..?

11-10-2025 12:05:13 AM

  1. పంట మార్కెట్‌కు వచ్చినా కొనుగోలు కేంద్రాల జాడలేదు 
  2. అధికారుల నిర్లక్ష్యం..
  3. రైతులకు శాపం.. 

కామారెడ్డి, అక్టోబర్ 10 (విజయక్రాం తి) : అసలే భారీ వర్షాలు జిల్లాలో కొరికి పెద్ద మొత్తంలో సోయా పంట, పత్తి పంట, మొక్కజొన్న పంటలు, వరి పంటలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిలించాయి. ముందుగా వేసిన రైతులకు సో యా పంట చేతికి వచ్చింది. ప్రభుత్వం సోయా. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులకు సోయా విక్రయించాల్సి వస్తుందని  మద్దతు ధర లభించడం లేదని రైతులు తెలిపారు.

జిల్లాలోని జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, నిజాంసాగర్, పిట్లం, పెద్ద కొడప్గల్, మండలాల్లో సోయా పంట పండింది. సోయ పంటను విక్రయించేందుకు రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీల వద్ద తీసుకువచ్చి ఆరబోస్తున్నారు. విక్రయించడానికి సిద్ధంగా ఉ న్నా రైతులకు ప్రభుత్వం సోయ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తున్నారు.

సకాలంలో సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే మధ్య దళారుల వ్యాపారులకు సోయా విక్రయించడం జరుగుతుందని రైతులు చెప్తున్నారు. అసలే వర్షాలు ఎప్పుడు కురుస్తాయో తెలియని పరిస్థితి రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ అధికారులు మాత్రం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో పండించిన పంటకు అమ్ముకుందామంటే మధ్య దళారి వ్యాపారులకు విక్రయించుకోవాల్సి వస్తుందని దీంతో మద్దతుతో రా లభించదని వ్యాపారులు చెప్పిన రేట్ కి అమ్ముకోవాల్సి వస్తుందని రైతులంటున్నారు.

ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ప్ర భుత్వం మాత్రం ముందుచూపుగా వ్యవహరించడం లేదని వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించ క అమ్ముకునే సమయంలో అవస్థలు పడాల్సి వస్తుంది అని రైతులంటున్నారు. అధికారులు మాత్రం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులకు తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు సైతం రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉం చుకొని సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సోయా కొనుగోలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 

సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలి ః తాసీల్దార్‌కు బీజేపీ నాయకుల వినతి

బిచ్కుంద, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే మద్దతు ధరతో సోయా పంట కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని మ ద్నూర్ మండల బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం మద్నూర్ మండల తహశీల్దార్ ఎండి ముజీబ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సోయా పంట మద్దతు ధర క్వింటాలుకు రూ.5328 ప్రకటించడం జరిగిందని అన్నారు.

ప్రస్తుతం ప్రైవేటు దళారులు సో యా పంట కొనుగోళ్ళను రూ.4100తో కొనుగోలు జరుపుతూ సోయా పంట రైతులకు భారీ మొత్తంలో మోసగిస్తున్నారని తెలిపారు. రైతులకు జరిగే మోసాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే మద్దతు ధర కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని ఈ సందర్భంగా వారు డిమాం డ్ చేశారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోసం జిల్లా అధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని మండల తహశీల్దార్ ముజిబ్ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తెప్ప వార్ తుకారాం, పార్టీ సీనియర్ నాయకులు కృష్ణ పటేల్, పండిత్ రావు పటేల్, బాలకిషన్ పాల్గొన్నారు.

త్వరలోనే జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం..

కామారెడ్డి జిల్లాలో సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు మార్క్ పేడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి రైతులకు మద్దతు ధర లభించేలా ఏర్పాట్లు చేస్తామనీ మార్కెట్ జిల్లా అధికారి ప్రవీణ్ విజయక్రాంతి ప్రతినిధితో తెలిపారు. రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని త్వరలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.