09-01-2026 12:00:00 AM
మధ్యతరగతి మనిషి జీవితంలో ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. అతడు తన కష్టాలను పెద్దగా చెప్పడు, చెప్పకూడదనే ఒక అంతర్ముఖ ఒప్పందం చేసుకున్నట్టే ఉంటాడు. తన బాధలు ఇతరులకు భారమవుతాయేమోననే సంకోచం అతన్ని మౌనంగా ఉంచుతుంది.
మధ్యతరగతి జీవితం పెద్దగా శబ్దం చేయదు. ఎక్కడా నినాదాలు ఉండవు, నిరసనలు కనిపించవు. కానీ ఆ జీవితం లోపల మాత్రం ప్రతిరోజూ ఒక అరుపు మోగుతూనే ఉంటుంది. ఆ అరుపు చెవులకు వినిపించదు, వార్తల శీర్షికలకెక్క దు, ప్రశాంతంగా నిద్రపోనివ్వదు. ఉదయం అలారం మోగగానే మొదలయ్యే పరుగు, రాత్రి కళ్లకు నిద్ర ముంచుకొచ్చే వరకు కూడా ఆలోచించడం ఆగదు. ఇవి మధ్యతరగతి జీవితం పెట్టే మౌనపు సంతకాలు. నవ్వుతూ పనికి వెళ్లే ముఖం వెనుక, తనకు తెలియకుండా భారంగా మారుతున్న రోజులు నెమ్మదిగా పేరుకుపోతుంటాయి.
ఉద్యో గం మధ్యతరగతికి ఒక ఆధారం మాత్రమే కాదు, భయం కూడా. అది ఉన్నంతవరకు బతుకు సాఫీగా నడుస్తున్నట్టే అనిపిస్తుంది. ప్రతినెలా జీతం పడే తేదీన ఒక పండుగలా ఎదురుచూడాల్సిన పరిస్థితి, అదే సమయం లో ఆ జీతం సరిపోతుందా అనే సందేహం మనసులో మౌనంగా తిరుగుతుంటుంది. ఎదుగుతున్న ఖర్చులు, మారుతున్న అవసరాలు, పెరుగుతున్న అంచనాల మధ్య ఉద్యోగం ఒక రక్షణ కవచంలా అనిపించినా, దాని వెనుక ఉన్న ఒత్తిడి మాత్రం కనిపించకుండా గుండెల్లో నిలిచిపోతుంది.
చిన్న విజయాలే ఊరట..
అప్పులు మధ్యతరగతి జీవితంలో శత్రువుల్లా రావు. అవి అవసరాల రూపంలోనే ప్రవేశిస్తాయి. ఇల్లు, చదువు, వైద్యం, పెళ్లి ఇలా ప్రతీ దానికి ఒక కారణం ఉంటుంది. కానీ ఆ న్యాయాలే క్రమంగా మనసుపై భారంగా మారతాయి. ప్రతినెలా చెల్లింపుల తేదీలు క్యాలెండర్‌లో ఎర్రగా గుర్తుపెట్టుకు న్న రోజులవుతాయి. అప్పు తీసుకున్న రోజు న కనిపించిన ఆశ, చెల్లించే రోజున కనిపించదు. అయినా మధ్యతరగతి మనిషి ఆ భారాన్ని బయట పెట్టడు. అన్నీ సర్దుకుంటాయిలే అని ఓదార్చుకుంటాడు. మధ్యతరగతి జీవితంలో కలలు చిన్నవిగా మారిపోతాయి. పెద్ద కలలు కనడం ప్రమాదమనే భావన నెమ్మదిగా మనసులో కూరుకుపోతుంది. మధ్యతరగతి అరవదు, కానీ ఆ మౌనం లోపల దాచుకున్న నిజాయితీ, సహనం, ఆశ.. ఈ మూడు కలిసి సమాజాన్ని నెమ్మదిగా ముందుకు నడిపిస్తూనే ఉంటాయి. మధ్యతరగతి మనిషి జీవితంలో ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది.
అతడు తన కష్టాలను పెద్దగా చెప్పడు, చెప్పకూడదనే ఒక అంతర్ముఖ ఒప్పందం చేసుకున్నట్టే ఉంటాడు. తన బాధలు ఇతరులకు భారమవుతాయేమోననే సంకోచం అతన్ని మౌనం గా ఉంచుతుంది. అందుకే అతని ఆనందా లు కూడా పెద్దగా కనిపించవు. చిన్న విజయాలే అతనికి పెద్ద ఊరటగా మారుతాయి. ఈ జీవితం అతన్ని లెక్కల మనిషిగా మార్చుతుంది. ప్రతి నిర్ణయం ముందు లాభన ష్టాలు తూకం వేస్తాడు. అవసరం మధ్య స్పష్టమైన గీత వేయడం అతనికి తెలియకుండానే అలవాటవుతుంది. తన కోరి కలను వెనక్కి నెట్టడం ఒక త్యాగంలా కాకుం డా, సహజమైన ప్రక్రియలా భావిస్తాడు. కాలంతో పాటు తనను తాను మలుచుకుంటూ, పరిస్థితులకు సరిపడే విధంగా జీవించడం నేర్చుకుంటాడు. ఈ సర్దుబాటు జీవితం అతన్ని బలహీనుణ్ని చేయదు. నెమ్మదిగానైనా నిలబడే శక్తిని ఇస్తుంది.
ఖండాలు, దేశాలు మారినా..
మధ్యతరగతి కుటుంబాల్లో మాటలకం టే మౌనమే ఎక్కువగా మాట్లాడుతుంది. పెద్దలు చెప్పని సూచనలు, చూపులతో అర్థమయ్యే బాధ్యతలు, మాటల మధ్య దాచిన ఆప్యాయత.. ఇవన్నీ సాధారణం. భావాలను బహిరంగంగా ప్రకటించకపోయినా, పరస్పరం అర్థం చేసుకునే ఒక అంతర్గత బంధం కనిపిస్తుంది. ఆ బంధమే మధ్యతరగతి కుటుంబాలను కష్టకాలంలో నిలబెడుతుం ది. బయటకు కనిపించని ఈ భావజాలమే మధ్యతరగతి జీవనానికి ఒక ప్రత్యేకమైన లోతును ఇస్తుంది. కాలం మారుతున్న కొద్దీ మధ్యతరగతి మనిషి కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాడు.మారుతున్న జీవనశైలి, పెరు గుతున్న పోటీ, వేగంగా మారే ప్రపంచం అతని ఆలోచనలను మరింత భారంగా చేస్తున్నాయి.
ప్రపంచం వేగంగా మారుతున్న ఈ కాలంలో మధ్యతరగతి జీవితం ఒక దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఖండాలు మారినా, భాషలు మారినా ఒత్తిళ్ల స్వభావం మాత్రం అలాగే ఉంటుంది. ఆసియా నగరాల్లో ఉద్యోగ సమయాలు పెరుగుతున్నా, యూరప్ దేశాల్లో పని జీవన సమతుల్యతపై చర్చలు పెరుగుతున్నాయి. అయి నా రెండు చోట్లా మధ్యతరగతి మనిషి తన స్థానం కోసం అంతర్గతంగా పోరాడుతూనే ఉన్నాడు. ప్రపంచీకరణ ఒకే రకమైన ఆశలను పుట్టించినా, వాటిని అందుకునే మార్గా లు మాత్రం అందరికీ సమానంగా లభించడం లేదు. జపాన్ వంటి దేశాల్లో ఉద్యోగ నిబద్ధత ఒక జీవన నియమంగా మారింది. అక్కడి మధ్యతరగతి కుటుంబాలు పని సంస్కృతి కారణంగా వ్యక్తిగత సమయాన్ని కోల్పోతున్నాయి.
కొత్త రకాల మార్పులు..
అమెరికా వంటి దేశాల్లో మధ్యతరగతి జీవితం అవకాశాలతో పాటు అనిశ్చితిని కూ డా మోస్తున్నది. ఉద్యోగ మార్పులు సాధారణమైనా, జీవన వ్యయం నిరంతరం పెరు గుతోంది. చదువు, వైద్యం వంటి అవసరా లు అక్కడ కూడా కుటుంబాలను లోపలికి మడిచేస్తున్నాయి. యూరప్ దేశాల్లో కొన్నిచోట్ల సామాజిక భద్రతా వ్యవస్థలు బలంగా ఉన్నప్పటికీ, అక్కడ కూడా మధ్యతరగతి కొత్త రకాల మార్పులను ఎదుర్కొంటోంది. జీవన వ్యయం పెరగడం, నివాస సమస్యలు, ఉద్యోగ భద్రతపై మారుతున్న పరిస్థి తులు.. ఇవన్నీ స్థిరంగా ఉన్నట్టుగా కనిపించే జీవితంలో చిన్న చిన్న చీలికలను తెస్తున్నాయి. ఆసియా దేశాల్లో, ముఖ్యంగా అభి వృద్ధి చెందుతున్న సమాజాల్లో, మధ్యతరగతి ఆశలు వేగంగా పెరుగుతున్నాయి.
విద్య, సాంకేతికత, పట్టణ జీవితం కొత్త కలలను చూపుతున్నాయి. అదే సమయంలో ఆ కలలను నిలబెట్టుకోవాలనే ఒత్తిడి కూడా పెరు గుతోంది. ఒక తరంలో మొదలైన ప్రయా ణం, తదుపరి తరానికి భద్రతగా మారాలనే తపన ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తపనే మధ్యతరగతి మనిషిని నిరంతరం కదిలిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచ పరిణా మాల న్నింటిని చూస్తే, మధ్యతరగతి జీవితానికి ఒక సామాన్య సూత్రం స్పష్టంగా కనిపిస్తుంది. దేశాలు మారినా, పరిస్థితులు మారి నా, జీవితం పట్ల ఉన్న బాధ్యత భావం, ఓర్పు, ఆశ మాత్రం ఒకేలా ఉన్నాయి. ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారం దొరక్కపోయినా, పరస్పర సహకారం, ఓర్పు, ఆశను విడిచిపెట్టకపోవడం మధ్యతరగతి జీవితానికి నిజమైన బలం. మౌనం కొనసాగుతూనే ఉన్నా, ఆ మౌనంలోనే వెలుగు పుట్టుకొస్తే, జీవితం కొంచెం తేలికగా మారుతుం దన్న విశ్వాసమే ప్రయాణానికి అసలైన ముగింపు.
వ్యాసకర్త సెల్: 9490841284
చిటికెన కిరణ్ కుమార్