29-10-2025 12:07:26 AM
-నేడు ఇంగ్లాండ్, సౌతాఫ్రికా సెమీస్
-మహిళల వన్డే ప్రపంచకప్
గుహావటి, అక్టోబర్ 28: క్రికెట్ అభిమానులను అలరిస్తున్న మహిళల వన్డే ప్రపం చకప్ నాకౌట్ స్టేజ్‌కు చేరింది. లీగ్ స్టేజ్ నుంచి 4 జట్లు ఇంటిదారి పడితే... భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ సెమీఫైనల్లో అడుగుపెట్టాయి. బుధవారం జరిగే తొలి సెమీస్‌లో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా తలపడబోతున్నాయి. గుహావటి వేదికగా జరగ నున్న ఈ పోరులో బలాబలాలు, గత రికార్డుల ప్రకారం ఇంగ్లాండ్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
లీగ్ స్టేజ్‌లో ఇంగ్లాండ్ చేతిలో సౌతాఫ్రికా చిత్తుగా ఓడిపోయింది. అలాగే గతంలో మెగాటోర్నీలో రెండుసార్లు సౌతాఫ్రికాను ఇంగ్లాండే దెబ్బ కొట్టింది. 2017, 2022 ఎడిషన్లలో సఫారీలను ఇంగ్లీ ష్ టీమే ఇంటికి పంపించింది. దీంతో ఈసారైనా వాటికి రివేంజ్ తీర్చుకోవాలని దక్షిణా ఫ్రికా ఎదురుచూస్తోంది. అయితే ఇంగ్లాండ్‌ను ఓడించడం అంత ఈజీ కాదు. అన్ని విభాగాల్లోనూ సఫారీల కంటే ఇంగ్లాండ్ అత్యంత బలంగా ఉంది. అలాగే గత రికార్డుల్లోనూ ఆ జట్టుదే పైచేయి. ఇప్పటి వరకూ ఇరు జట్ల మధ్య 47 వన్డేల్లో తలపడితే 36 సార్లు ఇంగ్లాండ్ గెలిస్తే.. సౌతాఫ్రికా 10 మాత్రమే గెలిచింది.