calender_icon.png 27 September, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించాలి

27-09-2025 12:21:45 AM

జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను

నారాయణపేట.సెప్టెంబర్, 26(విజయక్రాంతి) : మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించి, నారాయణపేట జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని విసి హాల్ లో మాదకద్రవ్యాల నిషేధం(యాంటీ నా ర్కోటిక్)పై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం డ్రగ్స్ పై సీరియస్ గా ఉందని మన జిల్లాలో గంజాయి సాగు జరగకుండా వ్యవసాయ శాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎవరైనా రైతు తన పొలంలో గంజాయి సాగు చేస్తున్నట్లు రుజువు అయితే అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ పరంగా లబ్ది చేకూరే సంక్షేమ పథకాలన్నీ రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. ఏ ఈ వో లు క్షేత్రస్థాయి పరిశీలన కు వెళ్ళి గంజాయి సాగు పై నిఘా పెట్టేలా ఆదేశించాలని అదనపు కలెక్టర్ డీ ఏ వో జాన్ సుధాకర్ ను ఆదేశించారు. జిల్లాలోని అన్ని జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో యాoటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి, ఆయా కమిటీల నేతృత్వంలో మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహ న కల్పించాలన్నారు.

మహా నగరాలలో పాఠశాలల విద్యార్థులకు చాక్లెట్ రూపంలో మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నారని చెప్పారు. మన జిల్లాలో పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, డిగ్రీ,జూనియర్ జూనియర్ కళాశాలలోనే కాకుండా పాఠశాలలలోనూ మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. సమావేశంలో డి.ఎస్.పి నల్లపు లింగయ్య మాట్లాడుతూ .. మక్తల్, ఊట్కూర్ లో గంజాయి పట్టుకుని కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

జిల్లాలోని జూనియర్, డిగ్రీ కళాశాలలలో పాటు మిగతా విద్యా సంస్థలలో కూడా డ్రగ్స్ నిషేధంపై విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులే కాకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో మాదకద్రవ్యాల నిషేధాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని ఆయన సూచించారు. జిల్లాలో జరిగే ప్ర తీ కార్యక్రమంలో మాదకద్ర వేల నిషేధ అంశాన్ని ఒక సబ్జెక్టు గా పెట్టుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీ.ఐ.ఈ.వో సుదర్శన్, వైద్య శాఖ అధికారి బిక్షపతి, కలెక్టరేట్ సీ సెక్షన్ అధికారిని అఖిల ప్రసన్న, ఎక్సైజ్ ఎస్.ఐ, తదితరులుపాల్గొన్నారు.