12-09-2025 12:15:37 AM
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజాపూర్, సెప్టెంబర్ 11: రాజాపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ కళాభవనం ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల అం బేద్కర్ సంఘం నాయకులు మండల సంఘం నాయకులు గురువారం రంగారెడ్డి గూడ గ్రామంలో ఎమ్మెల్యే నివాసంలో కలిసి దళితుల గౌరవార్థం మండల కేంద్రంలో అంబేద్కర్ కళాభవనం నిర్మించేందుకు సహకరించాలని వారు కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ అంబేద్కర్ కళాభవనం ఏర్పాటుకు సహాయ శక్తుల కృషి చేస్తానని అన్నారు. దళితుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండలాధ్యక్షుడు కృష్ణయ్య, యాదయ్య,సాయికుమార్, యాద గిరి,నర్సింలు,శేఖర్, బాలరాజ్,నరసింహ,ఇస్తారయ్య,బుగ్గయ్య తదితరులు పాల్గొన్నారు.