calender_icon.png 14 May, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారం కోసమే మహిళ హత్య

14-05-2025 12:14:04 AM

చేగుంట, మే 13 : గుర్తు తెలియని మహిళ దహనం కేసును పోలీసులు చేధించారు. వివరాల్లోకి వెళ్తే..చేగుంటలో ఈనెల 7న 44వ జాతీయ రహదారిపై  గుర్తుతెలియని మహిళను పెట్రోల్ పోసి దహనం చేయగా కేసు నమోదు చేసిన చేగుంట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మృతురాలు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల్ బస్వాపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడి టీచర్ బేకరి జయమ్మగా  గుర్తించినట్లు చేగుంట ఎస్.ఐ చైతన్య కుమార్రెడ్డి తెలిపారు. కేసును పుల్కల్ పోలీసులకు  బదిలీ చేసినట్టు తెలిపారు. ఇలావుండగా జయమ్మ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్లో అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తుంది.

ఈనెల 6న జయమ్మను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి అనుమానం రాకుండా చేగుంట జాతీయ రహదారి పక్కన హత్య చేసి దహనం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన చేగుంట, పుల్కల్ పోలీసులు ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. పుల్కల్ మండలం బస్వాపూర్కు చెందిన పుట్ట అనిల్కుమార్, డప్పు వినయ్ ఆమెను హత్య చేసినట్లు నిర్ధారించారు. దీంతో వారిని అరెస్టు చేసినట్లు పుల్కల్ పోలీసులు తెలిపారు.