calender_icon.png 1 October, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటపాటలతో ఆడిపాడిన మహిళలు, చిన్నారులు

01-10-2025 12:46:46 AM

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి: బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో& అంటూ.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని గండి మసానిపెట్ లో సద్దుల బతుకమ్మ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.

మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ముఖ్య కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి పాటలతో ఆడిపాడారు. కోలాట నృత్యాలతో ఆకట్టుకున్నాయి. మున్సిపల్ ఆధ్వర్యంలో మహిళ లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు. అనంతరం సమీప చెరువుల్లో నిమజ్జనం చేశారు. మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చుపుచ్చుకున్నారు.