08-09-2025 02:02:57 AM
దేశంలోనే మొదటి ‘మహిళా సమాఖ్య బంక్’
6 నెలల్లోనే రూ.15.50 లక్షల లాభం
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని తెలంగాణ ప్రభు త్వం ఇందిరా మహిళా శక్తి పాలసీని పటిష్టంగా అమలు చేస్తున్నది. అందులో భాగంగా నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్యలో ఉన్న 8,196 మహిళా సంఘాలలో మొత్తం 91,369 మంది సభ్యులు ఉన్నారు. ఇందిరా మహిళా శక్తి పాలసీలో భాగంగ నారాయణపేట జిల్లా సింగారం ఎక్స్ రో డ్డులో రూ.1.30 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్‌ను ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
20 ఏళ్లకు నెలకు రూ.10 వేల అద్దె ప్రాతిపదికన మహిళా స మాఖ్య ద్వారా ఈ పెట్రోల్ బంక్ నిర్వహణకు బి.పి.సి.ఎల్ తో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకున్నది. అందుకు అ నుగుణంగా పెట్రోల్ బంక్ నిర్వహణకు సం బంధించిన 11 మంది మహిళలకు ముందస్తుగా జడ్చర్ల, షాద్ నగర్‌లలోని పెట్రోల్ బంక్‌లలో మేనేజర్, సేల్స్ వుమన్‌లుగా శిక్షణను ప్రభుత్వం ఇప్పించింది. మొత్తం వ్య యంలో మౌలిక వసతులు కల్పనకు రూ.15 లక్షలు ఖర్చు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు మేరకు ప్రతి 15 రోజులకు ఒకసారి పెట్రోల్ బంక్ నిర్వహణపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తున్నారు. మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ లో రోజుకు 4 వేల లీటర్ల పెట్రోల్, 6 వేల లీటర్ల డీజిల్ ను విక్రయిస్తున్నారు. అందులో విధులు నిర్వర్తించే 10 మంది సేల్స్ ఉమన్ లకు ఒక్కొక్కరికి నెలకు రూ.13,200 చొప్పున, మహిళా మేనేజర్‌కు నెలకు రూ.18,000 వేతనంగా జిల్లా సమాఖ్య నుండి తీసుకుంటున్నారు. వేతనాలు, ఇతర నిర్వహణ ఖర్చులు పోను 6 నెలల్లో రూ.15.50 లక్షల ఆదాయాన్ని ఆర్జించినట్లు బంక్ మేనేజర్ చంద్రకళ తెలిపారు.