21-11-2025 12:00:00 AM
కామారెడ్డి, నవంబర్ 20 (విజయక్రాంతి) : మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి తీర్చగా అడుగులు ముందుకు సాగుతున్నారని ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా బిక్కనూరులో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి చీర సారి అందించడం జరుగుతుందన్నారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పగటి బందీగా నిర్వహించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక సామాజిక శ్రేయస్సు కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.
ప్రతి మహిళ ఆనందంగా పండుగలను జరుపుకునేందుకు ఇందిరమ్మ చీరల పంపిణీ వంటి కార్యక్రమాలను మరింత బలాన్ని ఇస్తాయని తెలిపారు. మహిళల సాధికారతపై ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ఇందిరాగాంధీ స్తుతితో ప్రతి మహిళ ఉక్కు మహిళగా ఎదగాలని అన్నారు. మహిళల ధైర్యం నాయకత్వం పట్టుదల దేశాభివృద్ధి కీలక మన్నారు.
ఇందిరాగాంధీ చూపించిన ధైర్య సాహసాలు ఈతరం మహిళలకు మార్గదర్శకమని ఆమె పేర్కొన్నారు. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ స్వయం సహాయక కార్యక్రమాలు మహిళలను మరింత శక్తివంతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్ప దిశగా సాగుతున్నదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్ర గాంధీ జయంతిని పురస్కరించుకొనిపంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు.
భిక్కనూరు మండల అభివృద్ధికి తనవంతు తోడ్పడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్, అదనపు కలెక్టర్ విక్టర్, డిప్యూటీ ట్రైనింగ్ కలెక్టర్ రవితేజ, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.