25-08-2025 12:00:00 AM
రాష్ర్ట ఇంటర్ బోర్డు జిల్లా ప్రత్యేక అధికారి దాసరి ఒడ్డెన్న
నిజామాబాద్ ఆగస్టు 24: (విజయ క్రాంతి) ః ఇంటర్మీడియట్ విద్య బలోపేతం కోసం ప్రభుత్వం జూనియర్ కళాశాలలకు కేటాయించిన నిధులను ఖర్చు చేయడం అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలోనే జరగాలని రాష్ర్ట ఇంటర్ బోర్డు నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి శ్రీ దాసరి ఒడ్డెన్న అన్నారు.శనివారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్య కార్యాలయంలో జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ తిరుమలపుడి రవికుమార్ అధ్యక్షతన జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్ ల సమావేశం జరిగింది.
ప్రత్యేక అధికారి శ్రీ దాసరి ఒడ్డెన్న మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో వివిధ మరమ్మత్తు పనులు, అభివృద్ధి పనులు చేపట్టడానికి గాను ఇంటర్ బోర్డు కేటాయించిన నిధులను అమ్మ ఆదర్శ కమిటీ చైర్ పర్సన్, ప్రిన్సిపల్ జాయింట్ అకౌంట్ తెరవాలని అన్నారు. మరమ్మతులు , అభివృద్ధి పనులు అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుందని అన్నారు. రాష్ర్ట ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ద్వారా ఆన్లున్ అటెండెన్స్ విధానం అమలు చేయాలని ఆదేశించారు.
కళాశాలలో విద్యార్థులు హాజరు శాతాన్ని పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. కళాశాలకు రాని విద్యార్థులను రప్పించేందుకు ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో అధ్యాపకులు కళాశాలకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ లను ఆదేశించారు. 2025 - 26 విద్యా సంవత్సరంలో కళాశాలలలో చేరిన విద్యార్థుల డేటాను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడంతో పాటు విద్యార్థుల యు డైస్ పూర్తి చేయాలని అలాగే అపార్, పెన్ నంబర్లను పూర్తి చేయాలని ఆదేశించారు.
అలాగే కళాశాలలో ఫిజిక్స్ వాలా ఆన్లున్ తరగతులను క్రమం తప్పకుండా నిర్వహించాలని రాష్ర్ట ఇంటర్ బోర్డు ప్రత్యేక అధికారి జో ఆదేశించారు.అలాగే అన్ని కళాశాలలలో విద్యార్థుల మానసిక ఉల్లా సం, శారీరక దృఢత్వం పెంచేందుకు వారంలో ఒకరోజు కచ్చితంగా క్రీడలను నిర్వహించాలని ప్రిన్సిపాల్ లను ఆదేశించారు.సమావేశంలో జిల్లా ఇంటర్ విద్యా అకడమిక్ సెల్ ప్రతినిధి శ్రీ నర్సయ్య, జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ లు పాల్గొన్నారు.